73.ఆంగ్లేయులు వ్యాపారం,వదిలి వెళ్లారు !దేశమంతా నేడు,విస్తరిస్తోంది, అదే !ఉన్నదంతా వ్యాపార ,సంస్కృతి విశ్వరూపమే!దేవాలయాలు సైతం,తెరిచాయి ఆమార్గమే !దైవ సేవ ధరలో ,ధర తోనే లభ్యం, నిజమే!74.రక్త సంబంధాలు ,పల(ర)చబడ్డాయి !ధన సంబంధాలు,కరగనంత ఘనీభవించాయి!తల్లి గర్భంలో,నవమాసాల. నివాసం!తల్లిపాలతో,శైశవాన పోషణం!నేటితరం , లెక్క కట్టి,తల్లి ఋణం తీర్చేస్తారేమో?75.చీమకు చిన్నతనం లేదు!పిట్టకి ఎగరడం పోదు!ఆవుకి అమ్మతనం అనాది!కుక్కకి విశ్వాసం గట్టి పునాది!మనిషి మానవతే,ఎక్కడా దొరకనిది!________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా పివిఎల్ సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి