13.
ధనం వద్దని ఎవరు,
మాత్రం అంటారు !
ఆ మాట అంటే ,
ఎవరు మాత్రం వింటారు!
ధనం చాలా ఇస్తుందిగా,
చూడమంటారు !
అందుకే దాని వెంట,
పడుతున్నాం అంటున్నారు!
అర్థం అనర్థాలు తెచ్చినా,
తేలు కుట్టిన దొంగల్లాఉంటారు!
14.
యుగ మేదైనా,
లోకం ధర్మాధారం!
కలియుగం ,
ధనానికి దాసోహం!
సత్యం, ధర్మం సనాతనం,
సరి జీవన మార్గం!
ధనంవద్దు ,అని అనం,
ధర్మం తోడు వదలమనం!
ధర్మం తోడు లేని,
ధనం కాలేదు సార్ధకం!
15.
డబ్బు ఎన్ని చేసినా,
ప్రాణం పోతూ ఉంటే,
మబ్బులా తేలిపోతుంది!
నిజ ధర్మ ఆచరణమే,
నీ ప్రాణం నిలబెడుతుంది!
కరోనా విశ్వానికి ,
నేర్పిన అద్భుత పాఠమిది!
గుణపాఠం మరవకు ,
కుక్క తోకలా బతకకు !
సర్వ ఆచరణల ధర్మ దృష్టి,
ఎన్నడూ విడనాడకు !
_____________________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి