31.దుఃఖాల నుండి ముక్తుడు,కార్యనిపుణుడు!దృఢ నిశ్చయం ,నిందాస్తుతి సమతుల్యం !సదా మమకార ,అహంకార రాహిత్యం!ఇష్టానికి పొంగడు,కష్టానికి కుంగడు!సుఖానికి లొంగడు ,కోరికలకు అందడు!32.సర్వజన మిత్రుడు,ముని, యోగి !శుచి, శుభాశుభ ,నిత్య పరిత్యాగి !సర్వదా ప్రాప్తంతో,సంతుష్టుడు !విశ్వాన ,ద్వంద్వములందు సమదర్శి !నిరాసక్తుడు, నిష్కాముడు,భగవత్ పరాయణుడు!33.నీవు విద్యావంతుడివా?చాలామంది ఉన్నారే!ధనవంతుడివయ్యావా?తలదన్నే వాళ్ళు వస్తారే !శాస్త్రజ్ఞుడివా? గతం,వర్తమానం, భావి వాళ్లదే!పాలకుడివా? అనంతరం,చరిత్రలో ఉంటావా !మనిషివి కా, మానవత్వం,నగిషీతో మెరిస్తే చాలు!_______________________రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి