జీవన సార్ధకత.;- డా పివిఎల్ సుబ్బారావు,9441058797.
 46.
    యాంత్రిక జీవనంతో,
                   మనిషి మర!
    మర కి నిత్యం ,
           మనస్తత్వం ఎర!
 
    మరకి స్పందన కరువు,
    మనిషికి బతుకు బరువు! 
   బరువుగా సాగే బతుకు ,
             నిత్యం అతుకు !
    
   అతుకుల బతుకు ,
            చివరికి చితుకు!
47.
నాగరికత వికాసం, సరే!
మానవతావికాసం మాటేమిటి? 
నాగరికతవికసించి,   
                మానవత్వం నశిస్తే! 
అనుక్షణం జీవితాన్ని,
                  స్వార్థమే శాసిస్తే !
మనిషి మరిచిపోయేది,
              జీవనపరమార్థమే!
48.
ఎంతో సుకృతం మానవ జన్మ! 
సార్ధకం కాకుంటే అదో పెద్దకర్మ! 
మనిషి, నీలో నిన్ను చూసుకో !
నీ బింబం చక్కగా సరిచేసుకో! 
పతనం నుండి నిన్ను,
                  నీవు కాపాడుకో!
_____________________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు