విఠల శతకము;- ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్సెల్ నెం 9441333315
కష్టములను పొంది యిష్టముతోరైతు
దేశ జనుల కెపుడు యాశ తీర్చు
అప్పు లెన్ని యున్న యతడేలె రారాజు
విఠలునిపలుకులను వినుపటేల

ఒంటి నిండ యీర్ష్య కంటిలో కోపము
కొంత మంది కుండు వింత బుద్ధి
మంచివారి కింత మర్యాద నియ్యరు
విఠలుని పలుకులను వినుపటేల

పెద్ద వాళ్ళ తోటి పేజీలు వలదయ్య
కత్తి మీది సాము కాటు వేయు
తగువులాడ బోవ తలబొబ్బ లెక్కును
విఠలువినుపటేలని పలుకులను 

పూలతోటి మనిషి పూజలు చేయగ
మనసు లోన కొంత మలినమున్న
 దొరక బోదు ఫలము ధరణలో నెప్పుడు
పూలతోటి మనిషి పూజలు చేయగ
మనసు లోన కొంత మలినమున్న
 దొరక బోదు ఫలము ధరణలో నెప్పుడు
విఠలునిపలుకులను వినుపటేల

ఎండ మావి నీరు యెవరికి దొరుకును
తీరబోదు దూప తిప్పలుండు
బ్రమలు పొందు మనిషి బ్రతుకంత చెడుచుండు
విఠలునిపలుకులను వినుపటేల


కామెంట్‌లు