పిల్లలను అరకు తీసుకొని వెళ్ళేటప్పుడు రైలు బండి చాలా నిదానంగా వెళ్ళేది నాలుగు ఐదు చోట్ల గుహలోపల నుంచి వెళ్లే మార్గం అవి వచ్చిన మరుక్షణం మా పిల్లలందరూ కేరింతలు చేస్తూ ఎంత ఆనందించే వారో చెప్పడానికి వీలు లేదు వారితో పాటు మేము కూడా ఆనందంలో పాలుపంచుకున్నాం అటు ఇటు ప్రకృతి దృశ్యాలను చూసుకుంటూ భోజనం సమయానికి అరకు వెళ్లి అక్కడ ముందు భోజనం చేసి ఆ పరిసర ప్రాంతాలను అన్నిటినీ ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకు వెళ్లడానికి నడక సాగేది కాదు ఆ ప్రకృతి సౌందర్యం మమ్మల్ని అలా నిలబెట్టేది కొండ ప్రాంతాలలో నివసించే అక్కడి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటే అదొక ప్రత్యేకమైన యాస కొన్ని మాటలు మనకు అర్థం కావు. అక్కడి నుంచి బస్సులో బయలుదేరి బొర్రా కొండలకు వచ్చి ఆ లోపల దృశ్యాలను చూస్తూ ఉంటే భారతదేశంలో ఎలాంటి గొప్ప శిల్పలు ఉన్నారో ఆ రోజులలోనే ఎంతటి గొప్ప కళాఖండాలను సృష్టించారో చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఒకచోట నీటి చుక్కలు పడుతున్నాయి. పది పదిహేను నిమిషాల్లో అది గడ్డ కట్టి రాయి లాగా తయారైపోతుంది ఆ వింత ఏమిటో ఇంతవరకు ఎవరికీ తెలియదు మా పిల్లలు దాని చుట్టూ చేరి కొంచెం ధైర్యం ఉన్నవాళ్లు చేయి చాచి ఆ నీటి చుక్కలను తన చేతిలో వేసుకుని ఎంతో మురిసిపోయేవారు కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు కాకాని వెంకటరత్నం గారు ఈ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేశారో అప్పటివరకు మాకు అర్థం కాలేదు. ఇలాంటి దృశ్యాలు చూడడానికి అవకాశం లేని ఆ పిల్లల జీవితాలలో శాశ్వతంగా ముద్ర వేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంత ఉపయోగపడతాయో పిల్లల భవిష్యత్ జీవితంలో అవి చిరస్మరణీయంగా ఉంటాయి అన్నది కాకాని గారి అభిప్రాయం ఆ తెల్లవారి భద్రాచలం వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఆ పరిసర ప్రాంతాలను అన్నిటినీ తిలకించి ప్రత్యేకించి కొండపైన సీతమ్మవారు ఆరవేసిన చీర ఆనవాళ్లు ఈనాటికి అలాగే ఉన్నాయి మరి అలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఆ రోజుల్లోనే వాల్మీకి మహర్షి ఎంత తపశ్యాలి కాకపోతే ఆసియా ఖండంలో ఉన్న ప్రతి అంగుళాన్ని విశ్లేషించి అక్కడి గొప్పతనాలను వ్రాయగలిగారు అలాంటి వాల్మీకి మహర్షి వ్యాసులవారి వంటి వారు జన్మించిన పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం కాక మరి ఏమిటి?
ఉక్కు మనిషి కాకాని;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి