విచిత్ర మనస్తత్వాలు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవ మనస్తత్వం గమనించినట్లయితే  తనను గురించి తాను ఆలోచించేవాడు తక్కువ  ఎదుటివారి తత్వం ఎలా ఉంటుందో వారికి అనుకరణంగా  ప్రవర్తించాలన్న అభిప్రాయంతో చాలా మంది ఉంటారు  సహజంగానే కొంతమంది ధనికులు ఉండవచ్చును మరి కొంత మంది పేదవారు  అంతకుమించి దీనస్థితిలో ఉండి విచారించే  వ్యక్తులు కూడా ఉండవచ్చును  సమాజం అంటేనే అనేక రకాల మనుషులను కలగలిపిన గుంపు ఎవరు ఎలా ఉంటారు అనేది మనం చెప్పగలమా  అనేకమంది  దాంబికానికి అలవాటు పడి ఉంటారు  మనసులో వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది దానిని మాత్రం బయటకు చెప్పరు  వారి ప్రవర్తన దానికి విలక్షణగా ఉంటుంది  అలాంటి వాటిని మనం అర్థం చేసుకోగలమా.
ఇవాళ మనం సమాజంలో చూస్తున్నట్లయితే  ప్రత్యేకించి కొంతమంది ఆడవారు  అటు రాజకీయ రంగంలో కానీ మరి రంగంలో అయినా  ఎదుటివారు ఎంత ఆడంబరంగా కనిపిస్తే వారిని మించిన  ఆకర్షణీయమైన పద్ధతిలో  ప్రజల ముందు నిలబడాలని  వారిని మించి తమకు బాగా పేరు ప్రఖ్యాతులు రావాలని  కోరుకొని అలా ప్రవర్తించే వాళ్లను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము  అక్షరం ముక్క తెలియని వాళ్లు కూడా  అన్నీ తెలిసిన వారిలా మైకు ముందు ఎలాంటి  ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు  వారి మాట్లాడే మాటల్లో  ఎన్ని వ్యతిరేక అర్థాలు వస్తూ ఉంటాయో తెలియకుండా మాట్లాడితే  తెలిసినవారు శ్రోతలుగా ప్రేక్షకుడిగా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. తన అవసరాలు తీరిన తర్వాత మామూలు స్థితికి రావడం సహజం  ఇలాంటి డాంబీకులను ఎలా అర్థం చేసుకోవాలి  వీరు పూర్తిగా రాజకీయాలకు అంకితమైన వారా అంటే అదీ కాదు  అవకాశవాదులు అని అంటే వీరికి అది అయిన నమ్మకం జల ప్రవాహాన్ని ఒకసారి గమనించండి  ఎటుపల్లంగా ఉంటే అటు వెళ్లడానికి  ప్రయత్నం చేస్తుంది మీరు  మళ్లీ ఓ చిన్న దిబ్బ లాంటిది ఎదురైతే దాని ప్రక్క  ఎక్కడ పల్లంగా ఉంటే ఆ స్థలాన్ని ఆనుకోని అటు ప్రవహిస్తుంది  వీరు కూడా అంతే  ఎవరు పచ్చగా ఉంటే వారి వెంట పడడం  తరువాత వీరు మామూలు స్థితికి రావడం  దానిని గురించి వేమన అద్భుతమైన పద్యంలో మనకు నీతిని చెప్తున్నారు  పాడి వ్రాసిన పద్యాన్ని చదవండి ఒకసారి.

"కల్లు నీళ్లు త్రాగి కడు పెద్దవారిలో చీర విడిచి తిరుగు సిద్దురాలు పనులు దీరు వెనుక పాతలు గట్టురా..." 

కామెంట్‌లు