సమాజం అన్న తర్వాత అనేక రకాల మనస్తత్వాలు కూడిన మనుషుల కలయిక తో కూడింది ఒకరు చెప్పే మాటలకు మరొకరు చేసే చేతలకు ఏమాత్రం పొంతన ఉండదు ఎవరి భావాలు వారికి ఎవరి ఆశయాలు వారికి ఉంటాయి ఇలాంటి భిన్న ప్రవృత్తలు కలిగిన వ్యక్తుల వల్ల మనకు నుడులు నానుడులు వచ్చినాయి హాయిగా కుటుంబం మొత్తం ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాత దగ్గర నుంచి మనమడి వరకు అంతా కూర్చునే హాయిగా భోజనం చేస్తూ చక్కటి కబుర్లు చెప్పుకుంటున్న సందర్భాలలో ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి ఒక ఇంట్లో ఒక చదువుకున్న కుర్రవాడు అస్తవ్యస్తమైన పనులు చేస్తూ ఉంటే వారి తాత అంటాడు ఒక మాట అరే చదువుకున్న వాడికన్నా చాకలి మేలు అని వాడు చాలా ఆశ్చర్యపోతాడు.
అదేమిటి తాత నన్ను అలా పోలుస్తావు నేనేమైనా మీ అందరి బట్టలు ఉతుకుతున్నానా నన్ను ఎందుకు అంత చులకనగా చూస్తావ్ నీ వయసుకు తగిన మాటలు ఇవేనా అంటూ చిరు కోపాన్ని ప్రదర్శించినప్పుడు నాన్నా అసలు ఈ వర్ణాలు వేదాలు ఎందుకు వచ్చాయో ఎలా వచ్చాయో తెలుసా గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు నీవు చేసే పనిని బట్టి నీ గుణం ఎలా ఉందో దానిని చూసి ఈ విభజన పద్ధతిని ఏర్పాటు చేశాను అంటాడు అతను బట్టలు ఉతుకుతూ అందరికీ సేవ చేస్తూ ఉంటాడు. కనుక చాకలి అని అంటున్నారు నీవు చదువుతున్నావు కదా నిన్ను విద్యార్థి అని పిలవాలిగా నీవు విద్యను అర్థిస్తున్నావా స్నేహితులతో తిరగటం వారి ముందు బడాయిలు చెప్పుకోవడం నీ పని.
నేను చెప్పినా మీ నాన్న చెప్పినా మీ అమ్మ చెప్పినా ఏ పనీ నీకు గుర్తుండదు ఏ వస్తువు నీకు తెలియదు నీకు తెలిసిందల్లా మీ పుస్తకాలు చదవడం దానిని క్లాసులో అప్పచెప్పడం అంతే తప్ప నీ మెదడును ఉపయోగించి ఏ ఒక్క చిన్న పని అయినా చేసావా చాకలి ఏం చేస్తాడు మన ఇంటి బట్టలు ఉతుకుతాడు ఒక్క ఇంటితో అతని భృతి గడుస్తుందా నాలుగు ఐదు ఇళ్లలో పని చేయాలి ఏ బట్టలు ఏ ఇంట్లో ఇవ్వాలో ఏ బట్టలు ఎవరు ధరిస్తూ ఉంటారో ఆ వివరాలన్నీ అతనికి కూలంకషంగా ఏ ఒక్కరోజు ఒకరి బట్టలు మరొకరికి మార్చడం కానీ ఉతికేటప్పుడు దేనినైనా చించడం కానీ జన్మలో చేయడు చేయలేడు కూడా ఇప్పుడు చెప్పు నీవు మెరుగా అతను మెరుగా అనగానే అతనికి తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కోరిక నెరవేర్చలేని దేవత కంటే కుక్క నయమని చిల్లరి మల్లయ్య వాళ్లను పూజించే కన్నా సర్వేశ్వరుని పూజించడం మేలని చెప్పిన నీతి
వేమన రాసిన పద్యాన్ని
చదవండి.
"చదువు వాని కన్న చాకలితా మేలు గురము వేల్పు కన్న కుక్కమేలు సర్వసురల కన్న సర్వేశ్వరుడు మేలు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి