మేధావి మరుపూరు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఒక పర్యాయం రెడ్డి గారు మా కేంద్రానికి వచ్చినప్పుడు  మీరు భగవద్గీతను అద్భుతంగా చెప్పగలరు కదా  మాకు చిన్న పిల్లల కార్యక్రమం ఉంటుంది  ఆ వయసులో పిల్లలకు బీజాన్ని మనం వేస్తే అది వట వృక్షంలా  వారి వయసుతోపాటు పెరిగినప్పుడు  దానిపై వాడికి ఆసక్తి పెరుగుతుంది చదవడానికి ఆసక్తి చూపుతారు అని అడిగితే  ఆరోజు ప్రత్యక్ష ప్రసారంలో పిల్లలతో  కూడి వారు కూడా చంటి పిల్లవాడిగా తయారై  వారి మనసులకు హత్తుకునే పద్ధతిలో వారి మాటల్లో  వారికి గీతా  సిద్ధాంతాన్ని అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన  మేధావి  ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసిన  ఆంజనేయ స్వరూపం అని అనిపించింది నాకు. వారు పిల్లలతో సంభాషించిన తరువాత  ఆ మాటే వారితో అంటే  చిరునవ్వుతోనే సమాధానం  చెప్పారు. హాలీవుడ్ అన్న పేరుతో రచనలు చేస్తూ ఉండేవాడు వారి 12 ఏళ్ళ వయసు లోపలే 15 ఎకరాల మాగాణ్ణి ఆస్తి మొత్తం పోయింది  రెడ్డిగారు మందాకిని అనే వార పత్రికను నడిపేవారు. 1954 వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరం వరకు  ఎందరెందరో సాహితీవేత్తల రచనలు అందులో ప్రచురించేవారు  ప్రత్యేకించి ఆయనకు మోహిని కథలు అంటే చాలా ఇష్టం  వారు రాసిన 40 రెండు కథలను  అనువదించి తన పత్రికలో ప్రచురించారు. ఒకవైపు జమీన్ రైతు వారి పత్రిక అధికార కాంగ్రెస్ రాజకీయాలను సమర్థిస్తూ రాస్తూ ఉంటే  కోదండరామిరెడ్డి గారు స్వతంత్ర పార్టీ రాజాజీ బెజవాడ రామచంద్రారెడ్డి వారి రాజకీయాలకు పత్రికలను వేదిక చేశారు.రోజు హిందూ పత్రిక క్షుణ్ణంగా చదివేవారు. వారు చదవడమే కాకుండా  తన కుమారునికి 16 వ సంవత్సరంవచ్చిన తర్వాత ఆయనతో కూడా హిందూ పత్రికను  చదివే అలవాటును నేర్పారు  నెల్లూరు పట్టణంలో ఆంగ్ల సినిమా ఏది వచ్చిన కుమారుని వెంటబెట్టుకుని వెళ్లేవారు  ఆ హాలు వాళ్లు వారి దగ్గర  టిక్కెటు తీసుకునేవారు కాదు. ఏ కొత్త సినిమా హాలు ప్రారంభోత్సవంలో  అయినా మరుపూరు కోదండరామిరెడ్డి గారి ఉపన్యాసం ఉండి  తీరవలసినదే  ఆయన బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం చదవడం తప్ప ఏ పరీక్షలు పాస్ కాలేదు వారు నడిచే  విజ్ఞాన సర్వస్వం  గ్రంథాలయం అని పేరు తెచ్చుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి  పరిచయం కావడం మన అదృష్టం  అని ఉషశ్రీ గారు నాతో అనేక పర్యాయాలు చెప్పడం  గమనార్హం.




కామెంట్‌లు