దినకరుడు-శుభకరుడు;- -- గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు-9966414580.
పశ్చిమ దిక్కున పవళిస్తాడు
తూర్పున వైపున మేల్కొంటాడు
ముద్దులొలికే బాలభానుడు
పగటినేలే రాకుమారుడు

అందరిపైన ఉదయిస్తాడు
లోకమంతా

చీకట్లను తరిమివేస్తూ
వెలుగుపూలు వెదజల్లుతాడు

భగభగ మండే దినకరుడే!
మండుతున్న అగ్నిగోళమే!
నీటిలో ఉండే కమలాలకు
అత్యంత ప్రియ బంధువుడే!

మార్తాండుడే లేకుంటే
గాఢాంధకారమే లోకం
మానవ మనుగడ అసాధ్యం
అడుగడుగునా అవరోధం

కామెంట్‌లు