వాగ్దానం!!!; - ప్రతాప్ కౌటిళ్యా
అది ఎండిపోయిన గుండె !
రక్తపు నీరు కాదు కన్నీరు కూడా లేదు.!!
నీటి గుంటల్ని 
నిండు సముద్రాలను చేసినట్లు
పాలమూరు గుండెల్ని
నిండుకుండల్ని చేసిన కల నిజమైన రోజు ఇది.!!!

గాలిని ఎత్తిపోసిన ఊపిరితిత్తులు ఇవి!
రక్తాన్ని ఎత్తిపోసిన నాలుగు గదుల గుండెలు ఇవి.!!

సముద్ర అలల్నీ సృష్టించిన చందమామలా
కలల్ని నిజం చేసిన కంటిపాపలు ఇవీ!!

తార్ ఎడారిలో నీరును సృష్టించి
ఎడారి ఓడను 
నీటి ఓడగా మార్చిన తీరు ఇది!!!

దేశమంటే నేను మీరు కాదు
దేశమంటే ఊరు దేశమంటే నీరు!!

ఆకాశం నుంచి గంగను కిందికి దించడం కాదు
ఆకాశానికే గంగను ఎత్తిపోసిన సముద్రం లాంటి ఒక నిజం ఇది!!
దశాబ్దాల యుద్దం తర్వాత
ఒక విజయం ఇది!!!!

భూమిలోని నీరు
వేరు ద్వారా ఆకు ఆకుకు చేరినట్లు
పాలమూరుకు చేరిన కృష్ణా జలాలు
బీడుకు వరమైంది
పాలమూరు వీరుడయింది!!!

పక్షుల్లా వలస వెళ్లే పాలమూరు జనం
కారు మేఘాల్లా
పాలమూరు పై వాలిపోతున్నవీ
ఈనేల ఈ గాలి ఈ వూరు
పచ్చని పైరంది!!!!

అడవుల్ని సృష్టించడం వానలకు తెలుసు
పంటలను పండించడం రైతులకు తెలుసు
ఆకలిని తీర్చడం అమ్మకు తెలుసు
పల్లె పల్లెకు పైరుకు నీరు ఇవ్వడం
పాలకులకు తెలిసింది ఇప్పుడు!!!!!!!!!??

సముద్రం వాగ్దానం చేసింది ఆకాశానికి
ఆకాశం వాగ్దానం చేసింది భూమికి
ప్రభుత్వం వాగ్దానం చేసింది పైరుకు
నీటి ముత్యాలు నీకు ఇస్తానని
సిరుల పంటలు పండిస్తానని!!!!?????!!!

మట్టిని నీటిని కలిపిన మొట్టమొదటి రాజు రైతు
పాలమూరు మట్టికి నీటిని కలిపి
పాలమూరు పేరు మార్చితే
పచ్చని పైరువూరు ఇప్పుడది!!!!!!!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో తరలి వస్తున్న కృష్ణా జలాలకు స్వాగతం పలుకుతూ రాసిన కవిత.

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273.

కామెంట్‌లు