అందరూ అక్షరాస్యులై ప్రపంచ స్థితిగతుల పట్ల అవగాహన కలిగియున్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు.
పాఠశాల ఉపాధ్యాయులు తూతిక సురేష్ మాట్లాడుతూ నిరక్షరాస్యులకు మన అక్షరాస్యులే అక్షరాస్యులుగా తీర్చిదిద్దవలసిన అవసరముందని అన్నారు. ఉపాధ్యాయులు ముదిల శంకరరావు ప్రత్యేక గీతాలు ఆలపించి సభను రంజింపజేసారు.
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు అందరిచే నినాదాలు నినదింపజేసారు.
అందరికీ విద్య అందరిదీ బాధ్యత, బడిలో చేరు భవితను కోరు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, బాల్యమంతా బడిలోనే గడపాలి పెద్దలంతా దీనిని సమర్ధించాలి, బాలకార్మికత్వం భావినిరోధకత్వం, అందరూ చదవాలి అందరూ ఎదగాలి, వయోజన విద్య ప్రయోజన విద్య, బడి బయట వద్దు బడిబాట వద్దు, అక్షరం పెంచును మేథస్సు ఆరోగ్యం పెంచును ఆయిస్సు, అక్షరం అభివృద్ధికి నాంది, చదువుకున్న బాలిక వెలుగు నిచ్చు దీపిక, విద్యాకమిటీలు అభివృద్ధికి దివిటీలు, బాల్యం బాలలహక్కు మున్నగు నినాదాలతో సభ హోరెత్తింది.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ఉపాధ్యాయులు తూతిక సురేష్, బండారు గాయత్రి, కింజరాపు నిర్మలాదేవి, బత్తుల వినీల, జన్ని చిన్నయ్య, పెయ్యల రాజశేఖరం, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, పడాల సునీల్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ, పులువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి