మల్లెలముచ్చట్లు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మల్లెపువ్వులు
కలంపట్టమంటున్నాయి
మంచికవితలను
కూర్చిపెట్టమంటున్నాయి

మల్లెలు
తెస్తా
మీదకు
విసురుతా

మల్లెలు
అల్లుతా
మెడకు
వేస్తా

మల్లెలు
చూపుతా
మదులకు
మత్తెక్కిస్తా

మల్లెకైతలు
వ్రాస్తా
మనసులను
మురిపిస్తా

మధుమాసం
వచ్చింది
మల్లెలకాలం
తెచ్చింది

కోకిలకంఠం
వినిపిస్తుంది
మామిడిపూత
కనిపిస్తుంది

మల్లెలవేళ
అయ్యింది
ఆలోచనలను
లేపింది

మల్లెతోటలు
పచ్చబడ్డాయి
తెల్లనిపూలు
తొంగిచూశాయి

మల్లెమొగ్గలు
తొడిగాయి
చిరునవ్వులు
చిందాయి

మల్లెబాలలు
పిలిచాయి
మదులను
మురిపించాయి

మల్లెకన్యలు
మాట్లాడాయి
సరససల్లాపాలు
సంధించాయి

మల్లెవిరులు
విచ్చుకున్నాయి
సౌరభాలు
మత్తెక్కించాయి

మల్లెభామలు
వలవిసిరాయి
మనసులను
దొచేశాయి

మల్లెలు
మరులుకొలుపుతున్నాయి
మోహములో
ముంచేస్తున్నాయి

మల్లెలు
తీసుకెళ్ళమంటున్నాయి
ప్రేమను
పంచిపెట్టమంటున్నాయి

మరుమల్లియలను
ముందుంచుతా
సిరిమల్లికలను
చూపించుతా

చూడండి
సంతసించండి
చదవండి
సంగ్రహించండి


కామెంట్‌లు