మట్టి మనిషి ;-.. కోరాడ నరసింహా రావు !
మట్టినే నమ్ముకున్న మట్టి మనిషి !
  నేలతల్లి పంటలతో పరవసిస్తే
   శ్రమఫలించిందని పులకించిపోయే పేద రైతు !

జీవిక కోసం నమ్ముకున్నదీ, అమ్ముతున్నదీ తన శారీరక శ్రమనే !

పొలమే తన జీవిత సర్వస్వం 
   చావైనా, బ్రతుకైనా... 
  ఆ పొలంలోనే... !!

మట్టితో తన అనుబంధం 
   జీవిత కాలం !
కష్టమైనా.... సుఖమైనా 
   ఆనందమైనా... దుఃఖమైనా 
  సర్వమూ నేలతల్లి ఒడిలోనే 

ఆతని శ్రమఫల సర్వస్వాన్నీ 
  ఈ ప్రపంచపు ఆకలిని తీర్చటానికే ధారపోస్తాడు !

ఆతడు ఈ జీవకోటికి 
  అన్నదాతగా శ్రమించ
  నడుమును బిగించినవాడు!


ఆతని శ్రమ ఫలించునుగాక !
. అన్నదాతా... సుఖీభవ !!
      ******

కామెంట్‌లు