..మూడు ముళ్లు;- . కోరాడ నరసింహా రావు !

 మూడు ముళ్ళు వేసిన నాడు మొదలైన అడుగులో, అడుగు 
ఆ ఏడడుగులతో ...., 
 ఎన్నడుగులు వేసారో ఆ దంపతులు !
  బిడ్డల భవిష్యత్తు కోసం.... 
 ఎన్నెన్ని అడుగుల ఆయాసపు నిట్టూర్పులను వదిలారో ఆ భార్యా, భర్తలు !!
   కన్న పిల్లలు, ప్రయోజకులై.... 
వారి బంగరు భవిష్య నిర్మాణంలో తల మునకలై సంపాదనా పరుగులో పోటీపడుతుంటే, వీరి 
పెనవేసుకున్న తాళి బంధంతో 
ఒకరి అడుగులో ;... 
 అడుగులో అడుగు వేసుకుంటూ...ఎండావానల,కష్ట సుఖాలలో ఒకరికి, ఒకరు గొడుగై  ఆఖరి మజిలీని దాటుకు గమ్యం చేరుకునే ప్రయత్నంలో..... 
    చివరికి ఒకరికి ఒకరమై మనఇరువురమే... మన దాంపత్యానికి, కుటుంబ జీవనానికి... 
  పూర్ణత్వం సిద్ధిoప జేసుకోవాలి అనుకుంటూ.... 
  తరలిపోయే ఆదర్శ దంపతులు వీరు !
    *&***

కామెంట్‌లు