శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 రాధ కృష్ణ ప్రేమ తత్వం అందరికీ తెలుసు.పురాణాల ప్రకారం వృషభాను అనే గోపాలుని కూతురు రాధ.బాల్యం నుంచి కృష్ణునితో ఆడిపాడింది.మహాభారతం ప్రకారం ధృతరాష్ట్రుడి సారధి అధిరధుని భార్య.ఈదంపతులే కుంతికి సూర్యుని వరంవల్ల పుట్టిన కర్ణుని పెంచి పెద్ద చేశారు.అందుకే కర్ణునికి రాధేయుడు అనే పేరు వచ్చింది.
అవధీ బఘేలీ మొదలైన భాషల్లో ఉప్పు ని రామరసం అంటారు.
రాయ్ బహదూర్ హిందీ రాయ్ ఫారశీ బహాదూర్ కల్సి ఏర్పడింది.బ్రిటిష్ పాలనలో గొప్ప భారతీయులకు ఈ బిరుదు ఇవ్వబడింది.రాయ్ బహదూర్ తో సమానం రాయ్ సాహెబ్ కూడా ఓబిరుదు.రాయ్ సాహెబ్ కన్నా కొంచెం తక్కువ.
రావణ్ శబ్దంకి అర్థం ఇతరులు ఏడ్చే వాళ్ళు గా ప్రవర్తించే వాడు అని అర్థం.రామరావణ యుద్ధం మన అందరికీ తెలుసు.కొంతమంది ఆపదంని బిరుదు గా భావిస్తారు.తమిళ పదం ఇరాసివన్ కి సంస్కృతరూపం రావణ అని అంటారు.
రావత్ రావ్ రాఉత్ ఈ మూడింటి అర్థం రాజపురుషుడు అని.చిన్న సామంత రాజులను రావ్ రావత్ అనేవారు.రాజస్థాన్ లో రావత్ పదప్రయోగం ఉంది.అక్కడ జాగీరు దార్ని రావ్ అని పిలిచేవారు.మహారాష్ట్రలో బాజీరావు గంగాధర్ రావు అనే పేరు వాడుక లో ఉంది.ఒడియా హిందీ గుజరాతీ మరాఠీ లోరావుత్ శబ్దం ఉంది.మరాఠీలో గుర్రంనడిపే రౌతు అని అంటారు.రాజస్థాన్ లోరావత్  రావ్ అనే జాతులు ఉన్నాయి.🌹

కామెంట్‌లు