"గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డు సోమన్నకు పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త,బాలబంధు గద్వాల సోమన్నను "గురజాడ స్ఫూర్తి రత్న" అవార్డు వరించింది. అనతి కాలంలో 42 పుస్తకాలు రచించి,తెలుగులో విశేష కృషి చేసినందుకు గాను గురజాడ అప్పారావు గారి 162 జయంతి సందర్భంగా అంతర్జాతీయ గురజాడ ఫౌండేషన్ (అమెరికా) అధ్యక్షులు,గురజాడ ముని మనుమడు గురజాడ రవీంద్రుడు,దామరాజు శంకరం,చిన సూర్య నారాయణ గారిచే రామకృష్ణ పాఠశాల, విశాఖపట్నంలో పురస్కార గ్రహీత గద్వాల సోమన్నకు ఘన సన్మానం జరిగింది.పురస్కారం కింద నగదు,మెమోంటో,శాలువా, ఫ్రేమ్ అందజేశారు. సోమన్న తెలుగు సాహితీ కృషిని వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పల్లి గోవింద్, ప్రసాద్,వర్రే నాంచారయ్య,నూకరాజు, కోరాడ నరసింహారావు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీత సోమన్నను పాఠశాల ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.
కామెంట్‌లు