శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 రసాయన విద్య అంటే ఔషధంకి సంబంధించిన అని అర్థం.ఎన్నో ధాతువుల భస్మం తో తయారుచేసిన మందుల సేవనంతోమనిషికి రోగాలు వచ్చేవికావు.ముసలితనం కూడా దూరం గా ఉండేది.బాగా బలం శక్తి సత్తా పెరిగేవి.ఆయుర్వేదంలో ఆమ్లక ఉసిరి కాయ లతో తయారు చేసే వారు.ఇప్పటికీ ఆయుర్వేద టానిక్ వాడుతున్నాం కదా? కెమిస్ట్రీ నా రసాయన శాస్త్రం అంటారు.
రసియా అంటే రసానందం అనుభవించటం.ఆటపాటలు వాద్యాలు వాయించటం కూడా అదే అర్థం.బుందేల్ఖండ్ బ్రజ్ ప్రాంతం లో హోళీ రోజు ల్లో హాసపరిహాసాల గీతాలు పాడటంనికూడా రసియా అనే అంటారు.
రాగ్ అంటే ప్రీతి. సంగీతం అంటే రాగాలు స్వరూపం.అనురాగం అంటే ఒకవ్యక్తి పై ప్రీతి అనురాగం.రాగం ఉపరాగం అని కూడా అంటారు.విషయాసక్తి అని అర్థం.సంస్కృత ప్రాచీన గ్రంథాలలో సూర్య చంద్ర గ్రహణాలు అని అర్థం.భాగవతంలో5వస్ఖందం 24వ అధ్యాయంలో 3వశ్లోకంలో ఈఅర్థం వాడబడింది.
రాజతిలక్ అంటే హిందీ లో పట్టాభిషేకం అని అర్థం.సింహాసనంపై రాజుని కూచోబెట్టి నుదుటి తిలకం దిద్ది నెత్తిన కిరీటం పెట్టడంని హిందీ లో రాజతిలక్ అంటారు 🌹

కామెంట్‌లు