శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బీహార్ లోని పాట్నా కి సమీపం లో ఒక ప్రసిద్ధ ప్రాచీన స్థలమని రాజ్ గీర్ అనేవారు.రాజగృహం కి సామాన్య అర్థం రాజప్రాసాదం.ఇది వైభార్ విపుల్ పాండవ్ గృధకూట్ రత్నగిరి అనే 5కొండల మధ్య ఉంది.రాజులనివాసస్థానాలు.పాషాణయుగం నుంచి ఐతిహాసిక కాలందాకా మగధసామ్రాజ్యరాజధానిగా ఉంది.రామాయణ మహాభారతం పురాణం లో వర్ణించిన వసుమతి బృహద్రథపురం గిరివ్రజ కుశాగ్రపుర్ అనేపేర్లు విభిన్న రాజులపేర్లు మీదుగానే వచ్చినవి రాజ్ గీర్ కి సంబంధించినవే!రాజా వసు మొదలు జరాసంధుడు దాకా అతని వంశీయులు బింబిసారుని మొదలు అజాతశత్రువు తమ విశాల సామ్రాజ్యాన్ని ఏలారు.అజాతశత్రుని కొడుకు ఉదయునుడు తన రాజధానిని రాజ్ గీర్ నుంచి పాటలీపుత్రంకి మార్చాడు.
రాజ్ గీర్ హిందూ జైన బౌద్ధ ఇస్లాం మతాలకి పవిత్ర స్థానం గా ఉండేది.జైనబౌద్ధమత వికాసం ప్రచారం ఇక్కడ నుంచే మొదలైంది.భగవాన్ మహావీరుడు 14 చాతుర్మాసాలు రాజ్ గీర్ నలందా లో గడిపాడు.బుద్ధుడు కూడా ఇక్కడ ఉన్న పేర్లు పాళీ సాహిత్యం వృద్ధి చెందినట్లు చరిత్ర కారుల అభిప్రాయం.ఇక్కడే సోన్భండార్ గుహ ఉంది.దీనికి కొంచెం దూరంలో భీమజరాసంధులు28రోజులదాకా మల్లయుద్ధము చేశారు.కృష్ణుని సూచనపై భీముడు జరాసంధుని చంపాడు.ఇక్కడమన్ను తెల్లగా ఉంటుంది.ఈమట్టిలో జరాసంధుడు రోజు పాలు పారబోసేవాడట!🌹
కామెంట్‌లు