అధికార దుర్వినియోగం కి అడ్డుకట్ట ఆయన!; - అచ్యుతుని రాజ్యశ్రీ

 మనదేశానికి స్వతంత్రం రాకముందు వచ్చినాక గూడా జైలు లో మగ్గిన ఆయన అక్టోబర్ 11న జన్మించి అక్టోబర్ 7న తుదిశ్వాస విడిచారు.అధికారదుర్వినియోగంకి ఎదురొడ్డి పోరాడారు.
నాలుగేళ్లు నిండినా నోటిపాలదంతాలు రాలేదు ఆబాబుకి.అంతాబోసినోటి తాతా అని పిలిచే వారు.బాల్యం నుంచి సౌమ్యంగా ఆటపాటలు అంటే అనాసక్తి తో ఉండేవారు.జింక కుక్క కుందేలు అంటే ఇష్టం.
ఒకసారి తండ్రి ఒక జతపావురాలను పెంచుకోమని ఆబాబుకి ఇస్తే ఒకటి చనిపోయింది.అంతే ఆపిల్లాడురెండు రోజులు అన్నం తినలేదు.బడిలో చదువు కునేరోజుల్లో రక్షాబంధన్ పండుగకి బడికి సెలవు ఇవ్వకుండా పరీక్ష పెడితే ఈయన కొంత మంది పిల్లలు బడికి వెళ్ళలేదు.15 బెత్తం దెబ్బలు భరించారు.అలాగే తోటి విద్యార్ధి ఈయన పుస్తకం దొంగిలించాడు.తనిఖీలో దొంగ దొరికాడు."నిన్ను దొంగ గా ఎత్తి చూపిన నన్ను మన్నించు" అని అడిగిన సున్నితమనస్కుడు.
చదువులో ఫస్ట్ నడతలో బెస్ట్.18వ ఏటనే 14ఏళ్ళ అమ్మాయి తో పెళ్ళి జరిగింది.
భార్య ను సబర్మతి ఆశ్రమం లో చేర్చి తాను యు.ఎస్.లోపై చదువు కోసం వెళ్ళారు.కాలేజీ సెలవుల్లో ద్రాక్ష తోటలో రోజు కి 9_10గంటలు పనిచేశారు.హోటల్లో ఇళ్ళల్లో శుభ్రపరిచే పనిచేస్తూ ఎం.ఎ.పూర్తిచేశారు.20వ ఏట అమెరికా వెళ్లిన ఆయన 27వ ఏంటి స్వదేశం కి తిరిగి వచ్చారు.స్వాతంత్ర్య పోరాటంలో 28వ ఏటనే జైలు కి వెళ్లిన ఆయన  ఎమర్జెన్సీ కాలంలో దాదాపు 75ఏళ్ళ వయసులో జైలు పాలవటం నిజంగా మనం సిగ్గు బాధపడాల్సిన విషయం.వినోబాభావే ఆదర్శం గా కృషిచేశారు.1971లో చంబల్ బందిపోటు దొంగలు ఆయన కి లొంగిపోతామని మాధోసింగ్ ని పంపారు.అతన్ని పట్టించిన వారికి దాదాపు రెండు లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటన వెలువడింది.అతను తనంతతానుగా ఆయన కి లొంగిపోవటం అంటే ఆమహామనీషి ప్రభావం ఎంతటిదో?
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనని కాంగ్రెస్ బ్రెయిన్ అని వర్ణించింది.1977లో నాలుగు రాజకీయ పార్టీలను ఏకంచేసి ఇందిరా కాంగ్రెస్ ని ఓడించారు.భార్యాభర్తలు దేశంకోసం సంసారం పిల్లా పాపలు వద్దనుకున్నా రు.మరి అలాంటి నేతని దాదాపు అందరూ మర్చిపోయారు.
బ్రిటిష్ ప్రభుత్వం జైలులో తిండి తిప్పలు లేకుండా అలా కుర్చీలో కూర్చోబెట్టి రోజు10_12గంటలు నిద్రకూడా పోనీయకుండా ప్రశ్నలు చిత్రహింసలతో బాధించింది.మరి పదవులు వద్దని భారత దేశంలో అన్యాయం అక్రమాలపై పోరాటం చేసిన ఆమహానుభావుడిని జైలు లో పెట్టిన ఘనత మనది!!??ఆమహామనీషి జయప్రకాష్ నారాయణ.విజయదశమిరోజు యు.పి.లోని బాబర్ బనిలో పుట్టారు.తాతపోలీస్ ఆఫీసర్.అమ్మనాన్నలు ఫూల్ రాణి  హర్షూదయాళ్! భార్య ప్రభావతి🌺
కామెంట్‌లు