దండాలు దండాలు గణపయ్య;- ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
దండాలు దండాలు దండి గణపయ్య
వెండి కొండల్లో పార్వతి వేడుక చేస్తుంది
ఎలుక వాహనమెక్కి నీవు గణపయ్య
వేడుకలు చూడగా వేగిరాన రావయ్యా

మంచు కొండల్లో మీ తండ్రి శివుడు
నీకై ఎదురు చూస్తున్నాడు గణపయ్య
గజ్జల నాదముతో రావయ్య గణపయ్య
ఓంకార శబ్దలను వినవయ్య గణపయ్య

నీ అన్నా కుమారస్వామి వచ్చాడు
శివపార్వతుల చెంతనే ఉన్నాడు
పార్వతి పరమేశ్వరులు పిలుస్తున్నారు
పరుగు పరుగున రావయ్యా గణపయ్య 

మయూరమెక్కి మీఅన్నకుమారస్వామి
మూడు లోకాలు చుట్టూటకై వెళ్ళాడు
ఎలుక వాహనమెక్కి వచ్చి గణపయ్య
మూడు లోకాలను చుట్టి రావయ్యా

చిన్నగా మెల్లగ వచ్చి గణపయ్య
శివ పార్వతుల చుట్టూ తిరిగి గణపయ్య
తల్లిదండ్రుల పాదాలు మొక్కి గణపయ్య
మొదటి పూజ వరమొందినావు గణపయ్య


కామెంట్‌లు