ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది,;- మీసాల సుధాకర్,పి.జి.టి-తెలుగు,తెలంగాణ ఆదర్శ పాఠశాల,బచ్చన్నపేట మండలం,జనగామ జిల్లా.
 "దేవుడు కలడని లేడని,
ఏవిధమగు కలహమైన హీనమ్మగురా,
పావనుడగు గురువర్యుడు,
దేవుండగు ఆసుగుణుడు దీపముప్రజకున్"
తల్లి ఒడి,చదువుల బడి,దేవుని గుడి ఈ మూడు సంస్కార కేంద్రాలు. ప్రతి వ్యక్తికి మొదటి గురువు తల్లి.బడిలో చేరిన  అమాయకమైన పిల్లల మనసులో జ్ఞానబీజాలను నాటేవాడు,మంచి చెడులను తెలియజేసేవాడు,వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దేవాడు ఉపాధ్యాయుడు."గురువు లేని విద్య గుడ్డి విద్య".రేపటి  తరాన్ని తయారు చేసేటువంటి గురుతరమైన బాధ్యత గురువులది. అలాంటి గురువులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించినటువంటి బచ్చన్నపేట మండల విద్యాశాఖ,మండల నోడల్ ఆఫీసర్ శ్రీ డివిఎల్ఎన్ మూర్తి గారికి,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల అభివృద్ధి అధికారి శ్రీ రఘురామకృష్ణ గారికి 
మరియు బచ్చన్నపేట మండలం ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు,జిల్లా,రాష్ట్ర బాధ్యులు,ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినటువంటి వేముల బాలరాజు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు, మిత్రులకు కార్యక్రమాన్ని ఆద్యంతం చక్కగా సమన్వయం చేసిన అంకుషావలి సర్ గారికి, పరుశురాములు సార్ గారికి నన్ను బాగా ప్రోత్సహించే  మా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి మేడమ్ గారికి, నాకు పూర్తి సహకారం అందించే మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి వినయ పూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటున్నాను.

కామెంట్‌లు