తెలియునా మీకు పిల్లలూ... !;- కోరాడ నరసింహా రావు.
కరంటు  యొక్క గొప్పతనం 
  తెలియునా మీకు పిల్లలూ.. !
  దీనినే విద్యుత్తు అని కూడా అంటారు !

ఈ విద్యుత్తునే  ఇంగిలీషులో 
 పవరని... ఎనర్జీ ..... 
   అని  అంటారు !
   అంటే అర్ధము"శక్తి "అనర్రా.

పూర్వం మనకీ కరెంటులేదు... 
   చీకటి పడు తుందంటే... 
  దేవుని గదిలో..... 
  నూనెతో  గానీ,నెయ్యితోగానీ 
   దీపాన్ని వెలిగించి... 
    ఇళ్లల్లో - వీధుల్లో.... 
    ఆముదపు కాగడాలను... 
   కిరోసిన్ దీపాలను వెలిగించుకునేవారు !

విద్యుత్తను కనుగొన్న తరువాతే... 
  చీకట్లన్నీ తోకలు ముడిచి... 
  రేయి, పగలులా... 
    మారిపోయినది.. !

యంత్రాలన్నీ.... 
   చక - చక పనిచేస్తూ... 
   మనకు శ్రమనెంతో... 
     తగ్గించినవి !

ఏ సి,  ప్రిజ్, కూలర్, పేనులు
 ఉక్కపోతలను పారద్రోలి 
  చల్లదనం కలిగించు చున్నవి 
 వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు... 
  మిక్సి లు , మోటార్లు... 
 అమ్మకు శ్రమను తగ్గించినవి !

రేడియో, సినిమా, టీవీలు.. 
 వి జ్ఞానమును, వినోదమును 
   కలిగించుచున్నవి !

అన్ని సుఖములకు... 
  ఆనందములకు..... 
   ప్రగతి పధంలో...
    మనము నడచుటకు... 
    మూలము ఈ విద్యుత్తే నర్రా 

విద్యిత్తుకును..., 
  విజ్ఞాన శాస్త్రమున

కు... 
   చెబుదాము మనము జేజేలు 
     జెజెలూ.... జెజెలూ... !!
     *******

కామెంట్‌లు