తెలుగు దోహాలు..- ఎం. వి. ఉమాదేవి.
 1.
మాటకు యోగం ప్రశాంతే,మదిన నిలుపు వీలుంది!
నీతులు బద్దలు కొట్టితే,రోషమొచ్చు తీరుంది!
2.
లోకం విలువలు కోరదే,ఏది ధనము చూపెట్టు!
నాకమనునదే లేదులే,నరకము భువినే ఒట్టు!
3.
సత్యమొక్కటే నిలుచులే,లాభం మాత్రం లేదు!
చేయకు ఆత్మను తేలికే,భావి గెలుపుకది చేదు!
4.
అంకిత భావము లేనిదే,ఫలము కాదు అర్హతకు!
పరుల మీదను నెపాలనే,సులభమ్ముగా నెట్టకు!

కామెంట్‌లు