సర్వేంద్రియానం నయనం ప్రధానం అని, శరీరంలో అతి సున్నితమగు అవయవమైన కళ్ళను పరిరక్షించుకుంటూ జాగ్రత్తలు వహించాలని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తూతిక సురేష్ అన్నారు. పాఠశాలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కంటి పరీక్షల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వ పారా మెడికల్ ఆఫ్టాల్మిక్ అధికారి ఇప్పిలి జానకిరామయ్య ఆరు మీటర్ల దూరంలో చిన్న పెద్ద పరిమాణంలో గల అక్షరాలున్న స్నెలైన్ చార్టు బోర్డులను ఉంచి, విద్యార్ధుల కళ్ళకు ట్రయిల్ ఫ్రేమ్స్ ను ఉంచి, కంటిపరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా జానకిరామయ్య మాట్లాడుతూ ఆటలాడేటప్పుడు కళ్ళలో దుమ్ము ధూళి కణాలు చేరిన ఎడల చల్లని మంచినీళ్ళతో శుభ్రపరచుకోవాలని అన్నారు. తోటకూర, పాలకూర, క్యారెట్, బొప్పాయి భుజించి కంటి ఆరోగ్యాన్ని పొందాలని ఆయన అన్నారు.
కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడ్ వైద్యురాలు యల్లబిల్లి విమలా దేవి మాట్లాడుతూ కంటిలో నలక బయటకు రాని పరిస్థితుల్లో సమీపాన గల ప్రభుత్వ వైద్యాధికారులను సంప్రదించి తగు చికిత్స పొందాలని అన్నారు.
నాటు వైద్యం కోసం ప్రయత్నించవద్దనీ తద్వారా కంటి లోపల నల్ల గ్రుడ్డు ఐన కార్నియా దెబ్బ తినే ప్రమాదముందని విమలాదేవి వివరించారు.
ఎం.ఎన్.ఎం. మిరియాల సరస్వతి మాట్లాడుతూ విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి సంభవించునని, శాకాహారం తీసుకుని రేచీకటి రాకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఎం.ఎన్.ఎం. ఆర్.మాలతీభాయి మాట్లాడుతూ ఆకుకూరలు తిని నేత్రాలను కాపాడుకోవాలని అన్నారు. ఎం.పి.హెచ్.ఎ.ఎం. సవర శ్రీనివాసరావు మాట్లాడుతూ దృష్టి లోపం అనిపించగానే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.
ప్రభుత్వ పి.ఎం.ఓ.ఆఫీసర్ ఇప్పిలి జానకిరామయ్య 230మంది విద్యార్థులకు పరీక్షలను నిర్వహించగా 15మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించామని, నెలరోజుల్లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలను అందజేయనున్నామని అన్నారు.
ఇతర సాధారణ కంటి వ్యాధులు గల 52మందికి నేడే తగు మందులను అందజేసామని అన్నారు. ఆశ కార్యకర్తలు ఆర్.సరోజని, డి.సరోజని వైద్య పరీక్షలకు సహకరించారు.
ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు తూతిక సురేష్, ఉపాధ్యాయులు దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి