దీపాలు వెలుగునిస్తాయి
ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది!
విశ్వమంతా చుట్టి వచ్చిన మట్టి తేవాల్సిందే
ఎంత ఎదిగినా నీరు కిందికి దిగి రావాల్సిందే
దేహంలో కనిపించని దేవుడు గాలే
మొద్దులే కాదు మాంసపు ముద్దలు చిగురిస్తాయి.
ఇంటి వాకిట వాలిన వెలుగు కొత్తది ఏం కాదు. పాతది కావచ్చు.
వేల కిరణాలు నేల వాలినట్లు శిరస్సులు చీకట్లో చెప్తున్నాయి.
ఎంత వినయం వానకు
నీటి ముత్యాల్నే రాలుస్తుంది కన్నీటి వడగల్లను విసిరేస్తుంది
పచ్చి ఆకు ఆకలితో ఉంది. వరుపే కావాల్సింది. దానికి ఎంత ఓర్పు.!
దారము లేకున్నా దారి తెలియకున్నా గాలిపటానికి ఎంత పట్టుదల.
నగ్నంగా ఆకాశం కనిపిస్తే
నక్షత్రాలన్నీ నేలరాలిపోతున్నాయి
చీకటిని చిటికెన వేలు పట్టుకుంటే పోలా
పగలు రాత్రి ఒక్కటై రేపటి పొద్దుపుడితే అందరూ మురిసిపోతారు.
కళ్ళు రెండు ఒకేసారి మూసుకుంటాయి ఒకేసారి తెచ్చుకుంటాయి.
ఇంట్లోకి వెళ్లే అతిథులు ఇక ఎప్పటికీ బయటికి రారు.
విద్యుత్తుకు జతలు తప్ప పద్ధతులు లేవు.
పట్టుకుంటే ప్రాణం పోతుంది వదిలేస్తే లోకమంతా వెలుగుతుంది.
శరీరాల్లోని విద్యుత్తు దీపాల్లా ఒకదాన్ని ఒకటి వెలిగించుకుంటాయి.
కాళీ లేని భూమిని మనుషుల హృదయాల్లో మోస్తున్నారు.
నేను నీవు శిల్పాలం అనుకుంటున్నాం.
కానీ లోకానికి మనం సిలువ వేయబడ్డ ఏసుక్రీస్తులం.
ఎగిరిపడే చేప స్వేచ్చను స్వీకరించింది.
ఈదే చేప మరణించింది.
మిడుతల్లా పంటలను కాదు
ఉడుతల్లా ఉందాం పండ్లను తిందాం.
ఎదురైన ప్రతివాడు పలకరించడు.
కానీ పలకరించే ప్రతివాడు ఎదురవుతాడు.!
సైకత శిల్పానివి నీవు మానసిక మహారాణివి. మయూరానివి
ఒక్క మనసు తప్ప అంతా నీవు నా దానివి.
గద్దెనెక్కిన నిదురను గద్దతించేది గడియారమే చెప్తుందనుకుంటే యుద్ధం ఎందుకు.!!?
కోడి కూతల యుద్ధభేరిలెందుకు!!!?
శాశ్వత నిద్ర కోసమే కదా ఇదంతా.
కాకులు ఇప్పుడు చిలకలు అయ్యాయి
లోకమంతా తిరుగుతూ మనుషుల్లా మాట్లాడుకుంటున్నాయి.
కాకుల ఇంట్లో దీపం పెట్టింది ఎవరు.!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి