తెలుగు దోహాలు ; - -ఎం.వి.ఉమాదేవి

 18)
కాలము తెంపిన తీగలే,రాగమెట్లు పాడు సఖి
చేలము నిండెను చిరుగులే, బ్రతుకు పండుగవున సఖి !
19)
కానల శిలగా మిగిలినా, రామపాదమేది కలె?
శాపము వీడిన నారిగా , తనను తానెమల్చవలె !
20)
పాలసముద్రము పొంగినా, బాలమేన్లు సన్నములు
పేదరికంలో వేగుతూ, చేరలేవు పథకములు!
21)
చేరగ రావె చెలియవే, విరహపువర మీయకిట 
భారము మోసే హృదయమే , ఆగి పోవు నే మొనిట!
22)
గుప్పిట బిట్టున కదలరా, విధియె లొంగి పోద మరి!
చెప్పిన మాటలు చేయగా, ఫలము దక్కు తుంది సరి!
23)
పోరుకి విలువే మున్నదీ, ప్రాణనష్టమే జరగ?
శాంతిన తిమిరపు దారిలో, చిక్కును విజయమె వెలగ!
24)
పరిసరాలను శుభ్రతగా , ఉంచిన రోగము రాదు
శాస్త్రములే తిరగేసినా, ఇంతకన్న మరి కాదు!
25)
ఉల్లము ఝల్లని పొంగదా,కవనము చూపిన బాట!
చల్లని ఊహల పల్లకీ, ఎక్కుటేగ ప్రతి ఆట!
26)
మంచము వరకే చాపుకో, కాళ్ళుచేతులకు రక్ష!
కంచము ఖాళీ ఉండినా,బధ్ధకాన్కి మరి కక్ష! 
27)
ఇంపుగ గీతము పాడుకో, ఇష్టముండనిది జరగ!
నీలో లోపమె తలుచుకో, ఓర్మిరూప మేలవగ!
28)
దివ్వెల లో వెలుగంతనూ, చూపును సఖినే నేడు
నవ్వుల జాబిలి తానయే, తారలు రాలును నేడు!
29)
మంచికి నిలిచే వారికే, మోసమెదురు పడుతుంది!
కొంచెపు బుద్దుల పనియిదే, శిక్షముందునె  ఉంది!
కామెంట్‌లు