సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి . మనకీర్తి శిఖరాలు.-- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

  
(1860 - 1922) సంగీత విద్వాంసులు, త్యాగరాజ స్వామి వారి శిష్యులు, సంగీత విద్యాబోధకులు. వీరు కృష్ణా నది తీరంలోని పెదకళ్ళేపల్లి (కదళీపురం) అగ్రహారంలో గంగాధర శాస్త్రి, లక్ష్మాంబ దంపతులకు జన్మించారు. వీరు కొంతకాలం వేదం, సంస్కృతం అభ్యసించారు. వీరికి సాహిత్యంతో పాటు సంగీతాన్ని కూడా అభ్యసించవలెనని దృఢ సంకల్పం కలిగింది. మొదట సంగీతాన్ని కొంతవరకు నేర్చుకుని, తర్వాత తంజావూరు కాలినడకన వెళ్ళి, అక్కడ త్యాగరాజ స్వామికి శిష్యులు, బంధువులైన చావడి వేంకట సుబ్బయ్య గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. వీరిని ద్రవిడ దేశంలోని పేరొందిన గాయకులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, మహా వైద్యనాథ అయ్యర్, ఫ్లూట్ శరభశాస్త్రి సహాధ్యాయులు. సుమారు రెండు సంవత్సరాలు సంగీతం అభ్యసించి వీణ కుప్పయ్యర్, వారి కుమారులు ముత్యాలపేట త్యాగయ్య వద్ద గీతాలు, వర్ణాలు, పాఠాలు అభ్యసించారు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి సంగీత విద్యా సంప్రదాయాన్ని అనేకమంది విద్యార్థులకు నేర్పించారు .
వయొలినిస్టుగా అనేక చిత్రాల్లో పనిచేస్తూ వచ్చారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బురామన్‌ దగ్గర సహాయకుడిగా పలు చిత్రాలకు పనిచేశారు. చెంచులక్ష్మి' (1943), 'రత్నమాల' (1948 జనవరి2 విడుదల), 'స్వప్నసుందరి' (1950), అక్కినేని 'దేవదాసు' (1953) తదితర చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు.
నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. 'పరమానందయ్య శిష్యులు' (1950), 'శ్రీ లక్ష్మమ్మ కథ' (1950), 'స్త్రీ సాహసం' (1951) మొదలైన చిత్రాలలో హీరో అక్కినేని నాగేశ్వరరావుకు ప్లే-బ్యాక్‌ పాడారు. 'సర్వాధికారి' (1951) చిత్రంలో తమిళ హీరో ఎం.జి.ఆర్‌.కు గొంతు అరువిచ్చారు.
పర్లాకిమిడి రాజా గజపతిదేవ్‌ తీసిన 'నారద నారది' (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. ఆ తరువాత కొల్హాపూర్‌లో నిర్మించిన 'సేతు బంధన్‌' (1946) చిత్రానికీ,
 పూనాలో నిర్మించిన 'భట్టి విక్రమార్క' చిత్రానికీ సంగీత దర్శకత్వం వహించారు. 'సంసారం' (1950) చిత్రంతో సంగీత దర్శకుడిగా సుసర్ల దక్షిణామూర్తి బాగా ప్రాచుర్యం పొందారు. ఆ రోజుల్లోనే నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం నిర్మించిన రెండు, మూడు సినిమాలకు కలకత్తాలో పనిచేశారు. ఆకాశవాణిలో పనిచేయడం కూడా సంగీత దర్శకుడయ్యాక సుసర్లకు బాగా ఉపయోగపడింది. గాయని లతా మంగేష్కర్‌ అప్పట్లో ఢిల్లీ రేడియో స్టేషన్‌లో పాటలు పాడుతుండేది. ఆమె గాత్రంతో, ఆమెతో పరిచయం ఉండడంతో, వారు ఆమెతో తొలిసారిగా తెలుగు సినిమాలో 'నిదురపోరా తమ్ముడా...' అనే పాటను ఆమెతో పాడించారు. అన్ని భాషల్లోనూ కలిపి 135 దాకా చిత్రాలకు సుసర్ల దక్షిణామూర్తి పనిచేశారు. 'సంసారం' (1950) 'ఆలీబాబా - నలభై దొంగలు', 'సర్వాధికారి' (1951), 'ఆడజన్మ' (1951), 'దాసి' (1952), 'సంతానం' (1955), 'ఇలవేలుపు' (1956), 'హరిశ్చంద్ర' (1956), 'భలే బావ' (1957), 'శ్రీకృష్ణలీలలు' (1959), 'అన్నపూర్ణ' (1960), 'నర్తనశాల' (1963), 'శ్రీమద్విరాటపర్వం' (1979), 'శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' (1984) ఆయన సంగీతం అందించిన సినమాలలో కొన్ని. సంగీత దర్శకులు ఎస్‌.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్‌, శ్యామ్‌ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, సంగీత దర్శకుడు ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది - సుసర్లే! 'సంతానం' (1955)తో లతా మంగేష్కర్‌నూ, 'ఇలవేలుపు' (1956) తో రఘునాథ్‌ పాణిగ్రాహినీ, 'వచ్చిన కోడలు నచ్చింది' (1959)తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ, 'నర్తనశాల' (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. సుసర్ల స్వరపరచగా, రావు బాలసరస్వతి గానం చేసిన 'నీలవణ్ణ కణ్ణా వాడా నీ వరు ముత్తం తాడా...' (శివాజీ గణేశన్‌, పద్మిని నటించిన ఓ తమిళ చిత్రంలోని పాట) లాంటి తమిళ చిత్ర గీతాలు సైతం ఇవాళ్టికీ అక్కడ పాపులరే! సంగీత దర్శకుడిగా అవకాశాలు తగ్గాక, కుటుంబ పోషణ కోసం అప్పటి సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర పాటల రికార్డింగుల్లో వయొలిన్‌ వాద్య కళాకారుడిగా కూడా పనిచేశారు. 1982 నుంచి 1987 వరకు ఆయన చక్రవర్తి సంగీత బృందంలో వయొలిన్‌ వాయించారు.
'నారద నారది'లో చిన్నవేషం, రాజ్యం పిక్చర్స్‌ 'హరిశ్చంద్ర' చిత్రంలో కాశీ రాజు వేషం వేశారు.
సుసర్ల దక్షిణామూర్తి అనురాధా మూవీస్‌' అనే సంస్థను నెలకొల్పి, మోహినీ రుక్మాంగద', 'రమా సుందరి' చిత్రాలను నిర్మించారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతులమీదగా సన్మానం అందుకున్నారు. వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. 'స్వరశిల్పి', 'సంగీత కళాప్రపూర్ణ', 'సుస్వరాల సుసర్ల', 'స్వరబ్రహ్మ', 'సంగీత కళానిధి', 'సంగీత సమ్రాట్‌', ఎన్టీఆర్‌ పేర్కొన్న 'స్వర సుధానిధి' లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు.
మధుమేహం వ్యాధి వలన కంటి చూపు దెబ్బతింది. దాదాపుగా అంధత్వం ఆవరించింది. అయినా, ఆయన ఇప్పటికీ మనోనేత్రంతో సంగీత లోకాలను దర్శించడం మానలేదు. వయస్సు 90 ఏళ్ళు నిండుతున్నా, ఇవాళ్టికీ కాస్తంత హుషారుగా అనిపిస్తే, ప్రతిభావంతురాలైన భరతనాట్య కళాకారిణి అయిన మనుమరాలు శుభాంజలీ సద్గురుదాస్‌ లాంటి వారు చేతికి వయొలిన్‌ అందించగానే అలవోకగా పాట పాడుతూ, తీగలపై సుస్వర విన్యాసం సాగిస్తారు. తొంభై ఏళ్ళ వయసులో, కంటి చూపు లేక పూర్తిగా ఇంటికే పరిమితమైనా, చివరివరకు సుసర్ల దక్షిణామూర్తికి సంగీతమే మానసికంగా ఆసరా. చివరి వయస్సులో కూడా ఆయన ఒంటరిగా కూర్చొని, తనలో తానే ఏవో పాటలు, కీర్తనలు పాడుకుంటూ ఉండేవారు. బహుశా ఆ సలలిత రాగ సుధారస సారమే అనేక ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో మధ్య కూడా ఆయనను ముందుకు నడిపించింది.
వీరు 2012 ఫిబ్రవరి 09 న అనారోగ్యంతో చెన్నైలో పరమపదించారు.  
1. నారద నారది (1946) (సంగీత దర్శకుడు)
2. లైలా మజ్ఞు (1949) (నేపథ్య గాయకుడు)
3. పరమానందయ్య శిష్యుల కథ (1950) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
4. సంసారం (1950) (సంగీత దర్శకుడు)
5. శ్రీ లక్ష్మమ్మ కథ (1950) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
6. సర్వాధికారి (1951) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
7. సంతానం (1955) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
8. ఆలీబాబా నలభై దొంగలు (1956) (డబ్బింగ్)
9. హరిశ్చంద్ర (1956) (సంగీత దర్శకుడు)
10. ఇలవేల్పు (1956) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
11. వీర కంకణం (1957) (సంగీత దర్శకుడు)
12. భలే బావ (1957)
13. రాణి రంగమ్మ (1957) (సంగీత దర్శకుడు)
14. సంకల్పం (1957) (సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు)
15. బండరాముడు (1959) (సంగీత దర్శకుడు)
16. కృష్ణ లీలలు (1959) (సంగీత దర్శకుడు)
17. అన్నపూర్ణ (1960)
18. రమా సుందరి (1960) (నిర్మాత)
19. మోహినీ రుక్మాంగద (1962) (నిర్మాత)
20. నర్తనశాల (1963) (సంగీత దర్శకుడు)
21. శ్రీమద్విరాట పర్వము (1979) (సంగీత దర్శకుడు)
22. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) (సంగీత దర్శకుడు) .
కామెంట్‌లు