ధనుష్ కుమార్ ప్రతిభకు ప్రశంసలు

 చంద్రయాన్ నమూనాను రూపొందించిన ఆరవ తరగతి విద్యార్థి కోన ధనుష్ కుమార్ ను 
కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు 
గొర్లె తిరుమలరావు అభినందించారు. 
అదే విధంగా భూస్వరూపాల నమూనాను కూడా కేవలం కాగితాలు, అట్టముక్కలతోనే  అతి తక్కువ ఖర్చులతో రూపొందించిన ధనుష్ కుమార్ ప్రతిభ అసాధారణమనీ,
ప్రోజెక్ట్ వర్క్స్ లో భాగంగా ఆరవ తరగతి విద్యార్ధులు చక్కని సృజనాత్మకత ప్రదర్శించుట మిక్కిలి ప్రశంసనీయమని ఆయన అన్నారు. 
ధనుష్ కుమార్ తో పాటు ఆ తరగతి విద్యార్థిణీ విద్యార్థులు వలురోతు హాసిని, బూరాడ సంహిత, మడ్డు యమున, కిల్లారి అశ్విని, షేక్ రషీద్, గుబ్బాల తారక, ఇల్లాపు సుహర్ష్, వొల్ల రవితేజలు కూడా తమ ప్రతిభా పాటవాలతో చక్కని ప్రోజెక్ట్ వర్క్స్ ను రూపొందించారు. 
వీరిని ప్రోత్సహించిన ఆరో తరగతి  సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ దస్తూరీ వ్రాత, చిత్రలేఖన కళ, నమూనాలను రూపొందించే ప్రతిభ విద్యార్థులకు అలవడితే గొప్ప సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ఉపాధ్యాయులు తూతిక సురేష్, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్ముంనాయుడు, బత్తుల వినీల, కుదమ తిరుమలరావు, మదిలి శంకరరావు, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢిలు పాల్గొన్నారు.
కామెంట్‌లు