ఆదర్శవాది ముత్తులక్ష్మీ రెడ్డి;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.
 ముత్తు లక్ష్మీ రెడ్డి గారి పేరు వినని వారు అరుదు  భారతదేశ చరిత్రలో మొదట రాజకీయాలలోకి వచ్చి  మొదటి స్త్రీ ఎమ్మెల్యేగా  ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన యువతి  ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోగలిగిన సాహసి  అప్పటివరకు స్త్రీలు  చదువని  వైద్యశాస్త్రం చదివి  ఉత్తమ వ్యక్తిగా  ఎన్నుకోబడిన వైద్యురాలు  వ్యక్తులకు వైద్యం చేయడం  సామాన్యం  కానీ సమాజానికి వైద్యం చేయడం విశేషం  ఆ కార్యక్రమాన్ని ధైర్యంగా చేపట్టి  ఎన్ని అవాంతరాలు వచ్చినా  నిలిచి గెలిచినదే కానీ  ఓటమి చెందిన క్షణాలు ఆమె జీవితంలో లేవు  ఏ కార్యక్రమం ఆమె చేపట్టినా సమాజానికి హితం చేసే  ప్రతి పని  చట్టబద్ధం కావాలని  ప్రయత్నం చేయడమే కాదు సఫలీకృతురాలు కూడా అయ్యింది. రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ధర్మమార్గంలో ధర్మం కోసం పోరాడిన  ఏకైక మహిళ  ఆ రోజుల్లో కొంతమంది స్త్రీలను  దేవాలయాలకు అర్పించేవారు  వారికి వివాహాలు లేవు  అక్కడ పేరు ఉన్న ప్రతి వాడు ఆమెకు భర్త  అలాంటి దుష్ట దురహంకార  దుర్నీతితో కూడిన  వ్యవస్థను  రూపుమాపటం కోసం ఎంతో ప్రయత్నించింది.  ముత్తు లక్ష్మీరెడ్డి  అసెంబ్లీలో దీన్ని చట్టం చేయాలని  పట్టు పట్టినప్పుడు  సనాతనులు ఎవరూ దానిని అంగీకరించలేదు  ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ కూడా తటస్థంగా ఉండి  ఏ నిర్ణయము తీసుకోలేకపోవడంతో  ముత్తు లక్ష్మీ గారు  తమిళ దేశాల్లో  పెరియార్  నాస్తికత్వాన్ని ప్రభువు తీస్తున్నా సమయంలో  వారి వద్దకు వెళ్లి  వారికి విషయమంతా వివరంగా చెప్పి సలహా అడగడంతో  వారు చక్కటి సలహా ఇచ్చి పంపించారు.మరుసటి రోజు సభ ప్రారంభం కాగానే సత్యమూర్తి చర్చ ప్రారంభించారు  దేవదాసీలు సనాతన ధర్మం శాస్త్రాలతో దేవాలయంలో ఏర్పాటు చేయబడ్డ పరిచారికలు  దేవదాస్యుడు నేరుగా దైవ సేవకులు వారికి చేసే అన్ని పవిత్ర కార్యాలను బట్టి వారికి భగవంతుని  సర్వ ఆశీస్సులు సుఖ భోగాలు లభిస్తాయి  అన్న తర్వాత  ముత్తు లక్ష్మి గారు లేచి అయ్యగారు చెప్పిన శాస్త్ర విషయాలతో ఏకీభవిస్తున్నాను  కానీ ఇన్ని వందల సంవత్సరాల నుంచి మేము చేసిన సేవలకు మాకు ఇచ్చిన శుభాశీస్సులు మాకు ఇక చాలు  ఇకపై ఇటువంటి పనులు చేయడం ద్వారా దైవ ఆశీస్సులు మాకు ఇస్తాయి ఇది సనాతన ధర్మం అని నమ్మేవారు మీ ఇంటి ఆడవాళ్ళని స్వచ్ఛందంగా దేవదాసీలుగా పంపవచ్చు గదా అని ముగించగానే మద్రాసు నుంచి దేవదాసి నిర్మూలన చట్టాన్ని ఆమోదించింది అప్పటికి మద్రాస్ స్టేట్ లో ఉన్న రాయలసీమ కోస్తా ఆంధ్ర లోని మాతమ్మ జోగిని వ్యవస్థ మలబార్ ప్రాంతంలోని మంగా వ్యవస్థ కన్నడ ప్రాంతంలోని బస్తీలు రద్దు చేయబడ్డాయి.కామెంట్‌లు