న్యాయాలు -272
శతే పంచాశన్న్యాయము
******
శతే అంటే వందలో పంచాశత్ అంటే యాబది.అంటే వందలో యాభై ఉన్నట్లు.
వందలో రెండు యాభై ఇమిడి వుండటమంటే రెండు సమానమైన యాభైలు యిమిడి వున్నాయనీ,అందులో ఏ ఒక్కటి ఎక్కువ, తక్కువ కాదనే అర్థం ఈ న్యాయములో దాగి వుంది.
"దీనినే ఈ క్రింది శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది.
"వ్యాపక శత సంఖ్యాయాం యథా వ్యాప్య పంచాశత్సంఖ్యా నివిష్టా ఏవం యత్ర వ్యాపకే వ్యాప్యస్య నివేశస్తత్రాస్య ప్రవృత్తిః" అని"
వంద అనే సంఖ్యలో యాభైలు మాత్రమే కాదు ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు సంఖ్యలు కూడా యిమిడి వున్నాయనేది మనకు తెలిసిందే.
అయితే దీనిని జీవితానికి అన్వయించి చూపారు పెద్దలు. వివాహ బంధం అనే కోణంలోంచి చూస్తే సంసారం అనేది వంద యొక్క పూర్ణ రూపం అయితే అందులో యాభైలు భార్య లేదా భర్త యొక్క ప్రతీకలు. అలా వారిద్దరూ సమానమేనని,ఆ ఇద్దరు కలిస్తేనే వంద రూపమై శోభిస్తుందనీ ,ఆ విధంగా చూసినప్పుడే సంపూర్ణత్వపు భావన మనకు గోచరమవుతుందని పెద్దలు హృదయానికి హత్తుకునేలా చెబుతుంటారు.
అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఈ రెండు కూడా గౌరవనీయ, పూజనీయమైన వాక్యాలు.ఇందులో తల్లి తండ్రీ ఇద్దరూ పిల్లలకు సమానమే .వీరిలో ఎవరూ ఎక్కువ, తక్కువ కాదు.అర్థనారీశ్వర తత్వాన్ని పరిశీలించినా ఇదే బోధపడుతుంది.ఇరువురిని కలిపితేనే పూర్ణత్వం సాధ్యమవుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.రెండు అరలు కలిస్తే ఒకటి.పగలు,రేయి కలిస్తే ఓ రోజు.ఈ విధంగా దేనికదే ప్రత్యేకమే కదా!.
అలాగే సత్యం అనే పూర్ణ స్వరూపంలో ధర్మం యొక్క అన్ని విలువల కోణాలు దాగి వున్నాయనీ,అవి కూడా వేటికవే ప్రత్యేకమనీ , కానీ అవన్నీ పూర్ణత్వం లోని భాగాలేనని గ్రహించాలి.
ఈ "శతే పంచాశన్న్యాయము"ద్వారా ఇలా అనేక అంశాలకు సంబంధించిన విషయాలను, జీవిత సత్యాలను గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి