పున్నమిరోజు వస్తే
రేయి పగలుగామారితే
పరికించి చూడనా
పులకరించి పోనా
వెన్నెల కాస్తుంటే
కన్నులు చూస్తుంటే
నిద్దుర వస్తుందా
సద్దుగ ఉంటుందా
చుక్కలు పిలుస్తుంటే
చంద్రుడు వెళ్తుంటే
చూడక ఉంటానా
చెప్పక ఉంటానా
మబ్బులు లేస్తుంటే
మాటును చేస్తుంటే
మురవక ఉంటానా
మెచ్చక ఉంటానా
చల్లగాలి వీస్తుంటే
తలపులు తడుతుంటే
ఆడక ఉంటానా
పాడక ఉంటానా
నింగి వెలుగుతుంటే
నేల మెరుస్తుంటే
పగలుగ భావించనా
వగలును చూపించనా
ఆకాశం నీలమయితే
మేఘాలు వెండిగమారితే
తలనెత్తి చూడనా
కవ్వింపుకు గురికానా
అందం కనబడుతుంటే
ఆనందం కలుగుతుంటే
పుటలను నింపనా
పలువురికి పంపనా
ఆలోచనలు పారుతుంటే
ఆవేశం కలుగుతుంటే
కలమును పట్టనా
కవితలు కూర్చనా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి