మంచి అలవాట్లు ;- కొప్పరపు తాయారు
 జీవితం ప్రశాంతంగా సాగాలని ప్రతివారూ కోరుకుంటారు. ఆ ప్రశాంతతకు ఆనందం కూడా తోడైతే ఆ జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి అపురూపమైన జీవితంకోసం కొన్ని  అలవాట్లు చేసుకోవాలి :
మాట్లాడే ముందు, వినడం నేర్చుకోవాలి.
వ్రాసే ముందు, ఆలోచించడం నేర్చుకోవాలి.
ఖర్చుపెట్టే ముందు, సంపాదించడం నేర్చుకోవాలి.
ఒక నిర్ణయం తీసుకునే ముందు, పూర్వపరాలు నిర్ధారణకు రావాలి.
విమర్శించే ముందు కాస్త ఆలోచించి సమయం తీసుకోవాలి.
విరమించే ముందు, మరొక సారి ప్రయత్నించి చూడాలి.
పదవీ విరమణ చేసే ముందు, ఆదాయాన్ని దాచి ఉంచాలి.
చివరగా జీవన చరమాంకంలో నైనా తెలిసి/ తెలియక చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేయాలి.
పై విషయాలన్నీ చెప్పడం చాలా సులువు, కానీ ప్రయత్నించడం చాలా కష్టం.
ప్రయత్నించడంలో తప్పులేదు.

కామెంట్‌లు