సుప్రభాత కవిత -బృంద
కన్నయ్యా......
ఈ పిలుపులో ఎంత
దగ్గరితనమో!

జగద్గురువైనా.. కూడా
నీవుఅందరికీ ఇష్టమైన
చిన్నితండ్రివి.

నీ ప్రతి  చిలిపి అల్లరీ
ముచ్చటైన మురిపెమే!
నీ ప్రతి కదలికా
అద్భుతమే మాకు.

పుట్టిన క్షణం నుండీ
అన్నీ గండాలే నీకు...
అయినా అందరికీ
అండగా  వుంటావు.

అందరూ నీవారే...
కానీ నీవు ఎవరికీ
సొంతం కావు...

నీ లీలలు కథలుగా
చెప్పుకుంటాం కానీ
నీవు చెప్పిన గీతను
అసలర్థం చేసుకోము...

పరిస్థితుల వెంట పరిగెత్తిస్తావ్....
కలతలిచ్చి కన్నీళ్ళిస్తావు
గెలుపిస్తావు అలుపిస్తావు
కానీ మాయను తొలగించవు


మాలో ఒకడివి అనుకుంటాం
మాయలో పడిపోతాం.


నీ చక్కని మోము మధురం
నీ మోవిపై మోగే మురళి మధురం
నీ నామస్మరణ మధురం
నీ లీలలు మధురం
నీ మాటలు మధురం
నీ పాద సన్నిధి 
మధురాతి మధురం

మధురాధిపతివైన నీ సన్నిధే
మధువనం మాకు
నీ మధుర నామ స్మరణే
మకరంద సేవన మాకు

మా కన్నతండ్రివీ నీవే
మా చిన్నతండ్రివీ నీవే
మా నేస్తానివీ మా గురువువీ
మా సర్వస్వమూ నీవేనయ్యా
కృష్ణ య్యా.....

నీ పుట్టిన  రోజు పండగే
కదయ్యా మాకు...

కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు