ఒక్క మొక్క
అడవికి ఆరంభం
ఒక్క నవ్వు
స్నేహానికి ఆరంభం
ఒక్క చేయి
ఆత్మను కదిలిస్తుంది
ఒక్క మాట
లక్ష్యాన్ని ఒడిసిపట్టగల ధైర్యాన్నిస్తుంది
ఒక్క దీపకళిక
అనంత అంధకారాన్ని తుడిచేస్తుంది
ఒక్క నవ్వు
చింతలన్నింటినీ జయిస్తుంది
ఒక్క స్పర్శ
పూర్తి నిశ్చింతనందిస్తుంది
ఒక్క జీవితం
ఎన్నో ప్రత్యేకతల పునాది అవుతుంది!!
*********************************
ఒక్కటే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి