నేను;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేను
తావిని
నేను
తీపిని

నేను
అందాన్ని
నేను
ఆనందాన్ని

నన్ను 
చూశారా
నాకవితలు
చదివారా

మీ
తనివిని తీర్చానా
మీ 
మనసును ముట్టినానా

నా అక్షరాలు
కనపడ్డాయా
నా పదాలు
పలికించాయా

నా ఊహలు
ఊరించాయా
నా భావాలు
భ్రమించాయా

మీ
దృష్టిని ఆకర్షించానా
మీ
అభిమానాన్ని చూరగొన్నానా

నా అక్షరకుసుమాలు
ఆకట్టుకున్నాయా
నా సుమసౌరభాలు
ఆఘ్రానించమన్నాయా

కలాన్ని నేనే
గళాన్ని నేనే
ఆకాశాన్నినేనే
అవనిని నేనే

తోటను నేనే
చెట్లను నేనే
పువ్వులను నేనే
ఫలాలను నేనే

మబ్బును నేనే
జల్లును నేనే
నదిని నేనే
కడలిని నేనే

ఆటను 
నేనే
పాటను 
నేనే

అది నేనే
ఇది నేనే
అక్కడ నేనే
ఇక్కడ నేనే

నన్ను
ఎవరనుకున్నారు?
నన్ను
ఏమనుకున్నారు?

నేను
తెలుగును
నేను
వెలుగును

నేను
కవిత్వాన్ని
నేను
కమ్మదనాన్ని


కామెంట్‌లు