దూరాన తోచే
ఆవలి తీరం
బిరాన సాగెను
అడుగుల వేగం
రాలుపూల రాపిడితో
లేతగాలి పరుగులు
రంగురంగుల పూలకు
తొలి వెలుగుల హంగులు
దారినిండా ప్రేమ పరచి
మనసారా స్వాగతించి
మమతలూరగ మాలిమితో
తోడొచ్చే కలిమి లాటి చెలిమి
అనురాగపు అగరు పొగలే
అణువణువూ అలముకొనగా
అంతరంగము ఆనందమయమై
అరవిరిసిన అరవిందమైనదిగా
విచ్చే పూవుల తోట
ఇచ్చే నవ్వుల మాట
వచ్చే వెలుగుల బాట
తెచ్చే వరాల మూట
కష్టమైనా సుఖమైనా
చేయివీడని తోడుగా
జంట బాయక వెంట ఉండే
మింటను సాగే బంగరు తేరు
కురిసే బంగరు రేఖల
మెరిసే మేదిని త్రోవల
నడిచే నడకల వడిలో
నిలిపే అడుగుల గుర్తులు
కాలచక్ర గమనంలో
మళ్లీ వచ్చిన మరో వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి