కవిత పుట్టుక; - :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కవిత ఊరకే పుట్టదు! 
బాధామయగాథలు పట్టిపీడిస్తే 
విషాదపు ఛాయలు విస్తరిస్తే 
మనసు స్పందిస్తే, ఆత్మ కదిలితే
హృదయం పలికితే, మౌనం పగిలితే
చిన్నారి నవ్వితే, అమ్మ పిలిస్తే
ప్రేయసి పలికితే, నేస్తంతో మనసువిప్పితే
విరిసిన మల్లెలపై వెన్నెల కురిస్తే
నీలాకాశంలో చుక్కలు తళుక్కున మెరిస్తే 
వానచినుకులు ఆకసంలో ఇంద్రధనువై విరిస్తే 
ఉషోదయపు పొగమంచు 
పచ్చని ఆకులపై ముత్యంలా నిలిస్తే 
సుఖదుఃఖాలన్నీ మెదడు పొరల్ని తాకి 
అనుభవాల ఆలోచనాలోచనాలై 
కాగితమ్మీదికి ఎగబాకితే 
అప్పుడు
అప్పుడు కవిత పుడుతుంది!!
*********************************

కామెంట్‌లు