పురాతన నాగరికత సంస్కృ తే
నా సంస్కృతి....!
వేదాలలో సైతం కనిపించిన శబ్దం ఇది.
మత సంబంధం లేని దేశం మనది,!
ముత్తాతలు లేరని ---
ఇంటి పేరు మార్చేస్తామా?
మన స్వంత ఊరిలో ఇల్లు లేదని,
ఊరు పేరు మార్చేస్తామా?
సింధు నది లేదని --
మన పురాతన నాగరికతను
మరచిపోతామా!
అయితే కానీయ్ -
సరళ రాజ్యాంగం
మన ముఖ్య లక్షణం కదా!
ఆ సరళత్వాన్ని
భిన్నత్వంలో ఏకత్వాన్ని
చెరిపేసుకుందామా.....
మన అభిప్రాయలకు అనుగుణమైన
రాజ్యాంగమే మన లక్ష్యం....!
ఊరికే సవరించుకుంటూ పోతే,
ఇదేమైనా మామూలు గ్రంథమా !
"కులమతాలు లేని
ఎల్లలోకములొక్కిఇల్ల"ని,
గురజాడ కన్న కలలను
కల్లలు చేద్దామా.....!
ఎన్ని వసంతాలైనాయి
బానిస సంకెళ్లు వదిలి!
ఇప్పటికీ రాదా ఈ చైతన్యం
సమతా మమతా కదా
మన వేదం.....!
మనమంతా ఒక్కటే,
ముందు మన దేశ తలరాతను
మార్చాలి.
సమసమాజ స్థాపన అచ్చంగా జరగాలి.
పేదరికం నిర్మూలించబడాలి,
శాంతి సౌభాగ్యాలు సాధించాలి!
ఇవే కదా మన ఆశయాలు....!!
***
నా సంస్కృతి....!
వేదాలలో సైతం కనిపించిన శబ్దం ఇది.
మత సంబంధం లేని దేశం మనది,!
ముత్తాతలు లేరని ---
ఇంటి పేరు మార్చేస్తామా?
మన స్వంత ఊరిలో ఇల్లు లేదని,
ఊరు పేరు మార్చేస్తామా?
సింధు నది లేదని --
మన పురాతన నాగరికతను
మరచిపోతామా!
అయితే కానీయ్ -
సరళ రాజ్యాంగం
మన ముఖ్య లక్షణం కదా!
ఆ సరళత్వాన్ని
భిన్నత్వంలో ఏకత్వాన్ని
చెరిపేసుకుందామా.....
మన అభిప్రాయలకు అనుగుణమైన
రాజ్యాంగమే మన లక్ష్యం....!
ఊరికే సవరించుకుంటూ పోతే,
ఇదేమైనా మామూలు గ్రంథమా !
"కులమతాలు లేని
ఎల్లలోకములొక్కిఇల్ల"ని,
గురజాడ కన్న కలలను
కల్లలు చేద్దామా.....!
ఎన్ని వసంతాలైనాయి
బానిస సంకెళ్లు వదిలి!
ఇప్పటికీ రాదా ఈ చైతన్యం
సమతా మమతా కదా
మన వేదం.....!
మనమంతా ఒక్కటే,
ముందు మన దేశ తలరాతను
మార్చాలి.
సమసమాజ స్థాపన అచ్చంగా జరగాలి.
పేదరికం నిర్మూలించబడాలి,
శాంతి సౌభాగ్యాలు సాధించాలి!
ఇవే కదా మన ఆశయాలు....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి