మనం నవ్వితే
ప్రతిబింబం నవ్వుతోంది
మనం ఏడిస్తే
అది ఏడుస్తోంది
మనం వెక్కిరిస్తే
అదీ వెక్కిరిస్తోంది
మన మనసులాగే అదీనూ!
నిజానికి
అద్దం మన మనసేమో!
ఏమో!
ఎప్పుడూ ఇలాగే ఉంటుందా?
ఔను!
ఇలాగే ఉంటుంది!
అయితే
అద్దాన్ని బహిష్కరిద్దాం
మన మనసునూ బహిష్కరిద్దాం
మన జీవన గమనంలో
చేసే ప్రతిపనీ
మంచిదో, చెడ్డదో
మనసు అద్దం ఎత్తి చూపుతూనే ఉంది
మనకు జ్ఞానబోధ చేస్తూనే ఉంది
అయితేనేం?
మన స్వార్థం మనది
మన క్రోధం మనది
మన శతృత్వం మనది
అయినా...
అద్దానిదేమిటి పెత్తనం?
మనసుదేమిటి పెత్తనం?
అద్దంలాంటి మనసుదేమిటి పెత్తనం?
కాని...,
మనసు అద్దం
మన జీవన ప్రయాణంలో
దారిదీపం
రహదారి సూచిక
మనం పట్టించుకోకుంటే
అంతే సుమా!
చిత్తగించవలెను!!
********************************
.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి