సహజ కవి దువ్వూరి రామిరెడ్డి ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 విశ్వనాధ్ సత్యనారాయణ గారికి  నచ్చిన ఏకైకకవి తిక్కన  వారి శైలిలో ఉన్న ఇదే కవిత నైనా వారు ఆస్వాదిస్తారు అభినందిస్తారు నేను మా గురువుగారు ఉషశ్రీ గారు వారికి సన్నిహితులమైన  తరువాత అనేక పర్యాయాలు వారిని కలిసినప్పుడు కవుల ప్రస్తావన వస్తే తప్పకుండా రెడ్డి గారి  పద్యం ఒకటి వినిపించేవారు నిన్న అన్నది జరిగిపోయే  రేపు అన్నది కలదో లేదో  నేడు అన్నది ఉన్నది నిజం అనుభవించు అని ఒమర్ ఖయామ్ రాసిన  అద్భుతమైన గేయాన్ని  రామి రెడ్డి గారే వ్రాశారా అన్నంత  బ్రాంతిని కలుగజేసే రచన  నిత్యం తాగితే తప్ప కవిత వ్రాయలేడని వారి కవిత కూడా  వీరి చేతిలో జీవం పోసుకున్నది  అవతల మనిషి ఎంత గొప్ప వారైనా  వాడు అది అనడం ఆయనకు  అలవాటు.
నేను ఒక పర్యాయం నెల్లూరు వచ్చినప్పుడు  సింహపురి రైతు మాసపత్రిక సంపాదకుడు నిరంజన్ రెడ్డి గారు తన స్నేహితుని ఇంటికి వెళదాము అని తీసుక వెళ్లారు అది దువ్వూరి రామ రెడ్డి గారి  కుటుంబం అని  ఆ గృహస్తు కూర్చున్న తరువాత  నేను రామిరెడ్డి గారి పద్యాలు రెండు మూడు వినిపించినప్పుడు ఇది ఎవరు రాశారు చాలా బాగున్నాయి  అన్నాడు ఆయన  అదేమిటి రా అది మీ తాతగారు రాసినవి  అని చెబితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవాళ ఆంధ్ర రచయితల కవుల  సంతానానికి  తండ్రి గురించి తాత గురించి తెలియని స్థితి  విశ్వనాథ వారి రచనలు  వారి పిల్లలు  పావన శాస్త్రి కి  తెలియవు అంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది  రామిరెడ్డి గారి  తర్వాతికరం వారి పుస్తకాలను సేకరించి వారి పేరుతో  సంస్థలు కూడా స్థాపించి నడపడం  ప్రతి ఒక్కరూ ఆనందించవలసిన విషయం. సాహితే మిత్రులు దానశీలి  దువ్వూరి రామిరెడ్డి గారు అంటే ప్రాణం  కొండా లక్ష్మీ కాంత్ రెడ్డి గారికి  వారు ఒక పర్యాయం  దువ్వూరు  రామి రెడ్డి గారి  స్వగ్రామం తిమ్మారెడ్డి పాలెం  వెళ్లి వీరు ప్రచురించదడుచుకున్న కృషీ వలుడు పుస్తకంలో  వారి ఇంటి  చిత్రాన్ని ప్రదర్శించాలన్న అభిప్రాయంతో బయలుదేరి  వెళ్లే దోవలో  ఆ ప్రకృతి సౌందర్యానికి ఎంతో  ముగ్ధులయ్యారు.రెడ్డి గారు కవి  కళాకారుడు ఛాయాచిత్ర గ్రహకుడు  ఇంజన్ ఆయిల్  శాస్త్రజ్ఞుడు  వీటన్నిటికీ మించి  మానవత్వం ఉన్న మనిషిగా  రామి రెడ్డి గారి వ్యక్తిత్వం  అర్థం చేసుకున్న వ్యక్తి  తిరిగి హైదరాబాద్ వెళ్లేంతవరకు  రెడ్డి గారి స్మృతులు  వారి మనసులో  మెదులుతూనే ఉన్నాయి ఆ ప్రాంత ప్రకృతి సౌందర్యం  వారి కవితా వస్తువుకు మూలం అని వీరి అభిప్రాయం.



కామెంట్‌లు