హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 351
🦚🦚🦚🦚
లోపలి విజ్ఞాపనలు
ప్రేమ బాణపు పోలిక...!
దోచు జ్ఞాపకాలను
దాచు అజ్ఞాత పేటిక.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 352
🦚🦚🦚🦚 
ఈ క్షణము నుండే
కోరుకొనుము మోక్షము...!
పునరావృత జన్మ
రాహిత్యం అపేక్షము.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 353
🦚🦚🦚🦚
నాలో నీ వున్నావని
నా కెందుకు తెలియదు...!
తెలుసుకునే జిజ్ఞాస
నాకెందుకు కలుగలేదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 354
🦚🦚🦚🦚 
కుంచె చిన్నదైనను
చిత్రకారులకు గొప్పది...!
చిత్రం చిన్నదైనను
చూపరులకు చేరువైంది....!! 
🦚🦚🦚🦚
హరివిల్లు 355
🦚🦚🦚🦚 
కాకరకాయలను వాడు
చేదైనను నీకు తోడు......!
వేప ఆకు రుచిని చూడు
చిరుచేదైనను చేదోడు.....!!
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు