హరివిల్లు రచనలు - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,--9440522864.
 హరివిల్లు 356
🦚🦚🦚🦚
ఉత్తమ నాణ్యత యున్న
వస్తు ఉత్పత్తి తగ్గెను.......!
ఉత్తుత్తి పత్తి కలిగిన 
వస్త్రోత్పత్తి పెరిగెను........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 357
🦚🦚🦚🦚 
పుడమికి చేరె హిమ వాన
చేను పంట మట్టి లోన......!
అన్నదాత ఆవేదన
అయ్యెను అరణ్య రోదన....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 358
🦚🦚🦚🦚
ద్వాదశ స్తంభాలతో 
శంకర గుడి నిర్మాణం...!
సూర్య కిరణ స్పర్శతో 
మాస నామ స్ఫురణం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 359
🦚🦚🦚🦚 
దేశ వారసత్వ
సంపదను కాపాడుదాం...!
దేశ పౌరసత్వ
హక్కులను చాటి చెబుదాం..!!
🦚🦚🦚🦚
హరివిల్లు 360
🦚🦚🦚🦚 
నిజ నాయకత్వమనగా
బాధ్యతల సమాహారం....!
మారిపోయెనుగా! నేడది
ఆధిపత్య పోరు తరం......!!
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు