హరివిల్లు రచనలు -- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,9440522864.
 హరివిల్లు 361
🦚🦚🦚🦚
నక్షత్ర కుసుమాల
నడుమ చంద్రబింబం....!
నేల నింగి అలుముకున్న
పూర్ణ వెన్నెల బింబం.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 362
🦚🦚🦚🦚 
నింగిలో తేలియాడుచు
పరుగిడు అఘమేఘాలు..!
భూమాతను కొనియాడుచు
నేల రాలు జలధారలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 363
🦚🦚🦚🦚
నా చేతిలోని ధాన్యపు
బస్తాలను విదిలిస్తా......!
చేతనైన మాన్యాపు
ధాన్య సాయమందిస్తా....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 364
🦚🦚🦚🦚 
పచ్చ చీర కట్టె పడతి
అందం ద్విగుణీకృతం....!
చీర కట్టు చూసి పడితి
ప్రేమ లోన ఆసాంతం.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 365
🦚🦚🦚🦚 
అధర్మయుతమైన
ధనమును నిరాకరించు...!
ధర్మ వివేచన కలిగిన 
వ్యయము నిన్నుద్ధరించు...!!
                     (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు