109.
మనం చూడ లేకుంటే,
అంధత్వం!
శబ్దం విన లేకుంటే,
బధిరత్వం!
అడుగేయ లేకుంటే,
అవిటితనం!
మనలో మానవత్వం,
లేకుంటే ఆ తనం!
సర్వాంగ,
నిజ చైతన్య రాహిత్యం!
110.
కాలం అనంత సరళరేఖ,
నీవో బిందువు!
నీవు కావాలి,
అనంత ప్రేమ సింధువు!
నీ ముందు తరాలకు ,
ఆదర్శ ప్రతినిధి!
తరతరాలకు మార్గం,
చూపడం నీ విధి!
మానవత్వం దారి నిర్మిస్తే,
నీవే భావి జీవన సారథి!
111.
అనాదిగా భారతీయ,
కుటుంబ వ్యవస్థ!
విశ్వాన ఆదర్శ జీవన,
బలమైన సంస్థ!
నేడు ఆ కోటకు,
బీటలు పడుతున్నాయి!
కోటల గోడలు త్వరలో,
కూలనున్నాయి!
నిలబడు, నిలబెట్టు,
ప్రథమం మానవతా ధర్మం!
_________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు,-94410 58797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి