100.
చేయి చేయి కలుపుదాం!
స్నేహితులమై బతుకుదాం!
జనహితం కోరుకుందాం!
పరహితానికి ప్రాణం పెడదాం!
పోతేనేం, జనంలో బతుకుతాం!
101.
మనిషి నిత్య,
సత్యవాది!
అతని హృదయం,
. దయాజలధి!
మనసు ,
మానవత్వం పరసువేది!
సరి జీవన,
తత్వానికి పునాది!
అతడు నడిచే,
నిజ మార్గం అది!
102.
సకల తత్వాల మూలం!
బహు జ్ఞానాల సారం!
పుణ్య గ్రంథాల ప్రబోధం!
అవతారాల అంతరార్థం!
మానవత్వ ప్రతిష్టాపనం !
_________
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా పివిఎల్ సుబ్బారావు, 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి