133.
వాడు రోజూ,
అమ్మేది మాంసమే!
ఏ రోజు,
ఎవరికీ చేయనిది మోసమే!
వీడు పని చేస్తున్నది,
ఓమందు బార్ !
చదువులో ఎన్నడూ ,
కాలేదు డిబార్!
ఉదర పోషణకు ఓ వేషం,
ఏ మున్నది దోషం!
134.
ఆమె నిజంగా ,
ఉంపుడుకత్తే
ఆమె ఆత్మ,
పదునైన చురకత్తే!
లోకులు ,
ఆ శరీరాన్నే చూస్తారు!
మోహం కళ్ళతో,
వాళ్లు ఆత్మనేం చూస్తారు?
ఆమెది స్వధర్మం,
వీళ్ళది అధర్మం!
135.
వాడు నిత్యం,
మోసేది మూటలే!
వాడి జీవనాధారం,
కాయకష్టమే !
వీడు మాటలు ,
మారుస్తూ తీసేవి గోతులే!
చాపకింద నీరై ,
జనాన్ని దోచుకోవడమే!
వాడిది పవిత్ర గోముఖం,
వీడో గోముఖ వ్యాఘ్రం!
____'_____
రేపు కొనసాగుతుంది.
జీవన సార్ధకత.;- డా.పి.వి.ఎల్. సుబ్బారావు,9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి