జీవన సార్ధకత.;- డా. పి వి ఎల్ సుబ్బారావు 9441058797.
 82.
     ఉడుత సాయం ,
             చేవ్రాలు చేసాడు! 
   గుహుడి నావసేవ,
         కృతజ్ఞత తెలిపాడు!
    శిలకి చరణ స్పర్శతో,   
               జీవమిచ్చాడు!
  
    శబరి ఎదురుచూపుకి,
           సాంత్వన పలికాడు
   జటాయువు సమర్పణ,   
     అంత్యక్రియలు ఒనర్చాడు!
83.
     తండ్రి మాట విని,   
                  ఆచరించాడు! 
     రాజ్యాధికారం,
తృణప్రాయమని వదిలేసాడు !
 పదునాలుగేళ్ళ ,
వనవాసం వరంగా చేసాడు!
 స్నేహ ధర్మం ,
        చక్కగా పాటించాడు !
రామరాజ్యం స్థాపన,
        కావించి, పాలించాడు
84.
     ఇద్దరి మేటి గురువుల,
            సాటిలేని శిష్యుడు! 
   జీవితమంతా వినయ,  
              సార్వభౌముడు!
 ఇలపైన నడిచిన, 
సంపూర్ణ ధర్మస్వరూపుడు!
 పేరు తలిస్తే చాలు ,
హాయి కలిగించి తీరుతాడు! 
యుగమేదైనా మానవులకు,   
           మానవోత్తముడు!
________
రేపు కొనసాగుతుంది.


కామెంట్‌లు