చీమలే ఆదర్శం.. ;- --- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి సెల్ : 9441561655
పిల్లల్లార   పెద్దల్లార
చీమలు మనకు ఆదర్శం

చీమలు చక్కగా
బారులు కడతయి
ఎంతో బరువులు
మోస్తూ ఉంటయి

మోసిన గింజలను
దాస్తూ ఉంటయి
క్రమశిక్షణతో
సైనికులోలే పరుగులు
పెడుతూ ఉంటయి

పనిగంటలతో పని లేక
రోజంతా శ్రమ చేస్తూనే
  ఆదర్శంగా నిలుస్తూ
కష్టే ఫలిని నమ్ముకుంటయి

ఎండాకాలం పుట్టలలో
గుట్టలుగా దాచేస్తుంటయి
వానాకాలం ఇండ్లలో
కూసోని తింటుంటయి

రేపటి కోసం  ఈ రోజే
పొదుపును  పాటిస్తుంటయి
జీవనయానంలో చీమలే
ఆదర్శంగా నిలుస్తువుంటయి

      

కామెంట్‌లు