(అక్టోబర్ 1, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)====================================ఎవరు వృద్దులు?అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న ఆ రోజుల్లో డజను పిల్లల గని, పెంచి పెళ్ళిళ్ళు చేసిన పెద్దవారా...ఒకరిద్దరు చాలు, ఒక్కరే ముద్దు అని సరిపెట్టుకున్న నవతరం యువకులా...ఆరామెడైనా అలవోకగా నడుస్తూ.. వెళ్లి సునాయాసంగా పనులు చక్క పెట్టుకున్న వారు వృద్దులా?కూరగాయలకు సహితం స్కూటర్ లేకుంటే పోలేని నవతరమా?!.బస్తెడు ధాన్యం అలవోకగా మోసిననాటి ఆజానుబాహులా..ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా ఎత్తలేని నవతరం యువకులా?!అరువది లో ఇరువది లాఎనభై లో ముప్పైలా మీసం మెలేసేనాటి తరం నవ మన్మధులా?నలభైకే నడుంవాల్చే నవ తరమా?!జుట్టు నెరిసినా..కను చూపు మందగించినా..వయసు శరీరానికే కానీ..మనసుకు కాదని చెప్పే మీరేల వృద్దులు..నా కోడలు, నా కూతురునా అల్లుడు, నా కొడుకునా బిడ్డలు, నా మనమలే కాదుఊరంతా నా వారే..నా బలగమేఅందరూ ఆత్మ బంధువులుఅనుకునే మీరా వృద్దులు?నేను నా పెళ్ళాం అనుకునే నేటి తరం ప్రతినిధులా?!నా దేహం, నా కుటుంబం కన్ననా దేశం, అందరి క్షేమమే మిన్న అనుకునే మీరా వృద్దులు..నా కడుపు నిండితే చాలు అనుకునే నేటి తరం సుద్దులా?!.ఆకాశమంత అనుభవంభూదేవి అంత ఓరిమివిశ్వమంత ఆలోచనగల మీరేల వృద్దులు...అయితే గియితేచేతగాని, చేవలేని, సత్తువలేనిభయం లేని, భక్తి లేని, ప్రేమ లేనిసేవా గుణం లేని స్వార్థ చింతనగలపోతే పోనీ నాకేంటి..అనుకునే నిగనిగ లాడేనల్ల గడ్డపు పోరగాండ్లే నవతరపు వృద్దులు...మీ లాంటి వారందరూ..అపారమైన అనుభవంఅచంచల మైన విశ్వాసంఅబ్బురపరచే ఆప్యాయత,అనంతమైన అనురాగం మీ సొత్తు..మీరేల వృద్దులు..మీరు మా మార్గదర్శకులు..మీరు మా ఉనికికి మూలంమీ కివే మా శుభాకాంక్షలు..💐💐💐💐💐💐
ఎవరు వృద్దులు?..;- శిరందాస్ శ్రీనివాస్-9441673339
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి